newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

పోతే పోనీ..! పవన్‌ వ్యూహం అదుర్స్‌!!

11-10-201911-10-2019 11:22:54 IST
2019-10-11T05:52:54.603Z11-10-2019 2019-10-11T05:52:52.522Z - - 09-12-2019

పోతే పోనీ..! పవన్‌ వ్యూహం అదుర్స్‌!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాంతీయ పార్టీ బలంగా ఉండాలంటే బలమైన నాయకత్వం తప్పని సరి.. పార్టీని నడిపించే అధినేతకు పట్టు.. విడుపు రెండూ ముఖ్యమే.. అలాంటప్పుడే ఆ పార్టీ ఎక్కువకాలం మనుగడలో ఉంటుంది.. ఎంత ప్రజాదరణ కలిగిన అధినేత ఉన్నప్పటికీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే బలమైన నాయకులు ఉండాలి.. ఇది జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు తెలిసిన విషయమే... అనుభవంలో ఎదురైన అంశమే..

కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పవన్‌ పక్కన పెట్టారా..? అందుకే పార్టీ మారుతున్న నేతలను బుజ్జగించకుండా పోతే పోనీ అనే దోరణిలో సాగుతున్నారా..? అసలు పవన్‌ వ్యూహమేంటి..? ఇప్పుడిదే విషయం ఏపీలో హాట్‌టాపిక్‌ మారింది. ఇదిలా ఉంటే పవన్‌కు దగ్గరగా ఉండే జన సైనికులు మాత్రం పవన్‌ ఓ వ్యూహంతోనే ముందుకెళ్తున్నారని పేర్కొంటున్నారు.

రానున్న నాలుగేళ్లలో ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌, జూనియర్‌ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఒకవైపు టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న జనసేన నుంచి ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటంతో అసలు ఉనికే కోల్పోయే పరిస్థితి నెలకొంది.

జనసేనకు రెండు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్న అనుభవం ఉంది. 2014 ఎన్నికల్లో కేవలం తెరవెనుక ఉన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకొని ఆపార్టీపై విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేద్దామని ముందుకు సాగిన జనసేనకు 2014 నుంచి 2019 వరకు పార్టీలో పెద్దగా చెప్పుకోదగ్గ నేతలెవరూ చేరలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేతో జనసేన సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దీనికితోడు రెండు చోట్ల పోటీచేసినప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయారు. ఇక జనసేన పనిఅయిపోయిందని అందరూ భావించారు.

కానీ ఎన్నికల తరువాత పవన్‌ మరింత స్పీడ్‌ పెంచారు. సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూనే కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇక పవన్‌ మరింత యాక్టివ్‌ అయ్యారు.. వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగటం ఖాయమని జనసైనికులు భావించారు. కానీ కొంతకాలంగా జనసేన పార్టీని వీడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా పవన్‌ మౌనం వీడటం లేదు.

ఎన్నికలు అవ్వగానే గుంటూరు నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన చింతపార్థసారధి పార్టీని వీడారు. రాజమండ్రి నుంచి పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ సైతం వైసీపీ వైపు పయనమయ్యారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన జేడీ లక్ష్మీనారాయణ పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.

రానున్న ఐదేళ్లలో పార్టీని ఏపీలో బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా బలమైన నేతలు ఉండాల్సిందే. కొత్తగా నేతలు రావటం అటుంచితే పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటేనైనా పార్టీ ప్రజల్లో ఉనికికోల్పోకుండా ఉంటుంది. కానీ పవన్‌ మాత్రం పార్టీని వీడుతున్న నేతలను పట్టించుకోకపోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పవన్‌ మాత్రం వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారని పవన్‌కు దగ్గరగా ఉన్న జనసైనికులు పేర్కొంటున్నారు. 2023లో జరిగే సార్వత్రి ఎన్నికల్లో స్పష్టమైన బలం నిరూపించుకోవాలంటే.. పార్టీకి నిజాయితీగా కష్టపడేవారిని వెలికితీసి బరిలోకి నింపాలని పవన్‌ భావిస్తున్నట్లు అంటున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం మాని, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని వీడనివారిని, స్థానికంగా ప్రజల్లో బలమున్న జనసైనికులను తెరపైకి తెచ్చి వారినే ఎన్నికల నాటికి సానబెట్టాలని పవన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పార్టీ వీరవిధేయులు, ప్రజాధరణ కలిగిన స్థానిక నేతల లిస్ట్‌నుసైతం పవన్‌ తయారుచేసే పనిలో నిమగ్నమయినట్లు ప్రచారం సాగుతుంది. మరి పవన్‌ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయి.. నూతన రాజకీయ ఒరవడికి పవన్‌ వ్యూహం నాంది పలుకుతుందా.. అన్న అంశాలు తేలాలంటే వేచి చూడాల్సిందే.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle