newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ టాక్ : వారిని ఆత్మే క‌లిపిందా..?

02-10-201902-10-2019 10:25:15 IST
2019-10-02T04:55:15.701Z02-10-2019 2019-10-02T04:55:12.721Z - - 09-12-2019

పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ టాక్ : వారిని ఆత్మే క‌లిపిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆత్మ‌, అది అంతు చిక్క‌నిది. క‌నిపించ‌నిది. ఆత్మ మ‌న‌కు తెలియ‌కుండా చాలా ప‌నులు చేసిపెడుతుంది. అదే ఆత్మ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను ఒక్క‌తాటిపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుందంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ కొన‌సాగుతోంది.

అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రెండుసార్లు క‌లిశారు. ప్ర‌గతి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. సాగునీటి ప్రాజెక్టుల‌తోపాటు రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. ఎన్నిక‌ల ముందు నాటికి వీరిద్ద‌రూ క‌లిసింది లేదు. కానీ, ఏపీ ఎన్నిక‌ల త‌రువాత కేసీఆర్‌, జ‌గ‌న్‌లు క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఏక‌తాటిపై ముందుకు క‌దులుతున్నారు. అయితే, వీరిని క‌లిపింది ఎవ‌రు..? అన్న విష‌యంపై చాలానే చ‌ర్చ జ‌రుగుతుంది.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆత్మ‌గా పేరున్న కేవీపీ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో దాదాపు క‌నుమ‌రుగ‌య్యారే అనుకున్నారు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితం అయిన ఆయ‌న పొలిటిక‌ల్ ప్లాట్‌ఫామ్‌పై క‌నిపించింది త‌క్కువ‌.

రాష్ట్ర విభ‌న స‌మ‌స్య‌ల‌పై రాజ్య‌స‌భ‌లో పోరాటాలు చేశారు. ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. వైఎస్‌తో కేవీపీకి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ జ‌గ‌న్‌తో రిలేష‌న్స్ అంత‌గా లేద‌న్న‌ది అంద‌రూ చెప్పే మాట‌.

కాంగ్రెస్‌ను వీడి వ‌చ్చేట‌ప్పుడు త‌న మాట విన‌లేద‌ని కేవీపీ ఆ త‌రువార‌త జ‌గ‌న్‌కు దూర‌మ‌య్యాడ‌న్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు జగ‌న్‌కు కేవీపీ ద‌గ్గ‌ర‌య్యార‌ని గుస‌గుస రాజ‌కీయ‌వ‌ర్గాల్లో న‌డుస్తుంది.

కేసీఆర్‌తో జ‌గ‌న్‌ను అటాచ్ చేసింది కేవీపీయేన‌న్న ప్ర‌చారం న‌డుస్తుంది. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డంతోపాటు గోదావ‌రి, కృష్ణా జ‌లాలను అనుసంధానం చేయ‌డం వెనుక ఇద్ద‌రూ సీఎంలు క‌లిసి కూర్చోవ‌డం వెనుక కేవీపీ ఎత్తుగ‌డ‌లు ఉన్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ప్రాజెక్టు రివ‌ర్స్‌టెండ‌రింగ్ విష‌యంలో కూడా కేవీపీ సూచ‌న మేర‌కే జ‌రిగింద‌ని ఏపీ రాజ‌కీయ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు

అయితే జ‌గ‌న్ కేవీపీ మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు లేవ‌ని కొంద‌రు చెబుతున్నారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మాత్ర‌మే రిలేష‌న్స్ ఉన్నాయ‌ని, రాజ‌కీయ సంబంధాలు లేవ‌ని వారంటున్నారు. మ‌రోప‌క్క టీఆర్ఎస్ నేత‌ల నుంచి కూడా ఇదే స‌మాధానం వ‌స్తోంది.  కేవీపీ నుంచి స‌ల‌హాలు స్వీక‌రించే అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని చెబుతున్నారు. కేవీపీ కాంగ్రెస్ నేత అని, ఆయ‌న స‌ల‌హాలు ఎలా తీసుకుంటార‌ని గులాబీ నేత‌లు బాహాటంగానే ప్ర‌శ్నిస్తున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle