newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

14-10-201914-10-2019 13:48:26 IST
Updated On 14-10-2019 15:09:57 ISTUpdated On 14-10-20192019-10-14T08:18:26.829Z14-10-2019 2019-10-14T08:18:24.553Z - 2019-10-14T09:39:57.963Z - 14-10-2019

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి 2018లో తెగతెంపులు చేసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపతం కోసం రెండు రోజుల విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఈ లేటు పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు మీడియా నివేదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసమే తాను కేంద్రంతో ఘర్షించానని దాంతో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ నష్టపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో విభేదించాను. కానీ దానిఫలితంగా టీడీపీ ఇప్పుడు నష్టపోయింది. దాంతోపాటు రాష్ట్రానికి లాభమూ కలగలేదు. అలాంటి భేదాభిప్రాయం ప్రకటించకుండా ఉంటే ఈరోజు పరిస్థితులు మరోలా ఉండేవి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి అని చంద్రబాబు కార్యకర్తలకు హితవు పలికారు.

విశాఖపట్నంలో పార్టీ సమావేశానికి సంబంధించిన వీడియో క్లిపింగ్ ఒకటి టీడీపీ భవిష్యత్తు పథకాలపై బాబు ఆలోచనను తెలుపుతోంది. ''రాష్ట్ర ప్రయోజనాలకోసం గట్టిగా కృషి చేశానే తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ఆంధ్రప్రజల క్షేమం కోసం తప్పితే నాకూ, మోదీకి మధ్య శత్రుత్వం ఏమీ లేదు. నేను ఆయనతో విభేదించాను. అంతే.. ప్రతి ఒక్క అంశాన్ని మనం విశ్లేషిస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఈ విశ్లేషణ ప్రాతిపదికనే మనం భవిష్యత్తు గురించిన కార్యాచరణను రూపొందించుకోగలం'' అని చంద్రబాబు అంటున్నట్లుగా ఆ వీడియో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టానికి అనుగుణంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఇతర వాగ్దానాలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ టీడీపీ ప్రభుత్వం 2018 మార్చి నెలలో ఎన్డీఏ నుంచి బయటకి వచ్చింది. కూటమి నుంచి బయటపడ్డాక చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో తొలినుంచి సైద్ధాంతిక విభేదాలు ఉండేవని, కానీ రాజకీయంగా మాత్రమే రాజీ పడ్డామని చెప్పారు. నరేంద్రమోదీ స్థానంలో మరే వ్యక్తి అయినా సమర్థతతో పాలిస్తారని నమ్ముతున్నట్లు బాబు చెప్పారు. దేశంలో ఆర్థిక స్తబ్దతకు, సామాజిక అశాంతికి మోదీనే కారకుడని బాబు ఆరోపించారు.

అదే సమయంలో బీజేపీ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ఫలితాలను సాధించినప్పటికీ పలువురు టీడీపీ నేతలు ఎన్నికల అనంతరం బీజేపీలోకి దూకేశారు. పైగా చంద్రబాబు తప్ప తెలుగుదేశం నుంచి మరెవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని బీజేపీ సంకేతాలు పంపింది. సాక్షాత్తూ బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా టీడీపీతో పొత్తు ఇక ముగిసిన అధ్యాయమని, బాబుతో తమకు అవసరమే లేదని ప్రకటించడం బాబును హతాశుడిని చేసింది.

తెలుగుదేశంకి చెందిన నలుగురు ఎంపీలను చంద్రబాబు స్వయంగా బీజేపీలోకి పంపినప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం చంద్రబాబుకు అనుకూల సందేశాలు పంపని నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకోవడం పొరపాటని, అది పార్టీకి చాలా నష్టం కలిగించిందని బాబు పేర్కొనడం విశేషం.

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   11 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle