newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

పేద‌ల‌కు ఇళ్ల‌ప‌ట్టాల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ఫోక‌స్‌..!

11-09-201911-09-2019 17:49:51 IST
Updated On 11-09-2019 16:44:36 ISTUpdated On 11-09-20192019-09-11T12:19:51.487Z11-09-2019 2019-09-11T11:06:10.419Z - 2019-09-11T11:14:36.539Z - 11-09-2019

పేద‌ల‌కు ఇళ్ల‌ప‌ట్టాల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ఫోక‌స్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. మూడు నెల‌ల పాల‌న కాలంలో జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల్లో ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ప్ర‌ధాన‌మైన‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. గత ప్ర‌భుత్వాల మాదిరి కాకుండా ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌క్కాగా అమ‌లు చేసేందుకే కొంత స‌మ‌యం తీసుకోవాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తోంది.

అందులో భాగంగానే వ‌చ్చే ఉగాది నాటికి పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ లోగా 25 ల‌క్ష‌ల మందికి పంపిణీ చేయాల్సిన భూమిని గ్రామాల వారీగా సేక‌రించుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డ భూమి అందుబాటులో ఉందో నివేదిక సిద్ధం చేయాల‌ని సీఎం జ‌గ‌న్ క‌లెక్ట‌ర్‌ల‌కు సూచించారు.

అలాగే ఇళ్ల ప‌ట్టాల పంపిణీ వ్య‌వ‌హారంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల ప‌రిశీల‌న‌కు మంత్రులు సైతం జిల్లాల్లో పర్య‌టిస్తున్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌తోపాటు, మంత్రి చెరుకువాడ శ్రీ రంగ‌నాథ‌రాజు ఈ నెల 17 నుంచి జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. మొద‌ట‌గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించి ఆ త‌రువాత అన్ని జిల్లాల్లోనూ వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూముల‌కు సంబంధించిన వివ‌రాల‌తోపాటు ల‌బ్దిదారుల జాబితాను ఊడా వీలైనంత వ‌ర‌కు సిద్ధం చేసి ఉంచాల‌ని ఆదేశించారు.

ఈ క్ర‌మంలో క్షేత్ర స్థాయిల భూ స‌మీక‌ర‌ణ‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను వీలుంటే అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 13 జిల్లాల్లో క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌లు ముగించుకున్నాక ఇళ్ల ప‌ట్టాల పంపిణీకి సంబంధించి భూ ల‌భ్య‌త‌పై మంత్రులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు నివేదిక ఇవ్వ‌నున్నారు. ఒక‌వేళ అనుకున్న స్థాయిలో భూమి ల‌భించ‌న‌ట్ల‌యితే ప్ర‌యివేటు భూముల‌ను కొనుగోలు చేసైనా స‌రే ఇళ్ల ప‌ట్టాల కోసం సిద్ధంగా ఉంచాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle