newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

’’పేదల స్థలాలు కొట్టి పెద్దలకు పంచితే లాభమేంటి?’’

24-07-202024-07-2020 11:34:07 IST
Updated On 24-07-2020 13:09:53 ISTUpdated On 24-07-20202020-07-24T06:04:07.178Z24-07-2020 2020-07-24T06:03:06.394Z - 2020-07-24T07:39:53.700Z - 24-07-2020

’’పేదల స్థలాలు కొట్టి పెద్దలకు పంచితే లాభమేంటి?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కష్టకాలం నుంచి ప్రజలను కాపాడాలని చాతుర్మాస దీక్ష చేపట్టాననన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనా వ్యాప్తి చెందకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో జగన్  ప్రభుత్వం విఫలమైందని, కరోనా టెస్ట్ లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తున్నా.. రిపోర్టులు కూడా వెంటనే వచ్చేలా చూడాలన్నారు. క్వారంటైన్  సెంటర్లలో ప్రజలకు మెరుగైన వసతులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. 

కేంద్రం ఇచ్చిన నిధులతో కట్టిన నివాసాలను పేదలకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఆపేయడం కరెక్టు కాదని, డబ్బులు చెల్లించిన అందరికీ ఇళ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన సైనికులు, ప్రజల కోసం పవన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పేదప్రజల ఇళ్ల కోసమే బీజేపీతో కలిసి మేము నిరసన తెలిపామన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాల కేటాయింపు పేరుతో.. భూకబ్జాలు, అవినీతికి పాల్పడుతున్నారన్నారు. 

పేదల స్థలాలను కొట్టి.. పేదలకే పంచిపెట్టడం ఎంతవరకు సమంజసం. ఎన్నికల సమయంలో.. పార్టీలు అనేక రకాలుగా హామీలు గుప్పిస్తారు.. టిని ప్రజలు గుడ్డిగా నమ్మి ఓట్లేస్తే.. అంతిమంగా వారే నష్టపోతారు. కొంతమంది దళారులుప్రైవేటు స్థలాలకు రెట్టింపు ధరలను ప్రభుత్వం చేత ఇప్పించి సొమ్ము చేసుకున్నారని పవన్ విమర్శించారు. దీని వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, రాజధాని అంశంలో ప్రభుత్వం మొదటి నుంచి ఏకపక్షంగా, మొండిగా వెళుతోందన్నారు.

జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కూడా ఈ అంశంపై చర్చించామని, విభజన జరిగిన సమయంలో.. రెండు, మూడు వేల ఎకరాలను తీసుకుని రాజధాని చేస్తే బాగుంటుందని ప్రధాని కూడా చెప్పారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు.. ముప్పై వేల ఎకరాల భూమిని రైతుల నుంచి  సేకరించారని, ఈ విధానం సరికాదని.. నాడు జనసేన తరపున నేను.. రైతులకు, టీడీపీకి చెప్పినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. 

సింగపూర్ లాంటి పట్టణం నిర్మాణం కావాలంటే... ఒకేసారి ఎప్పటికీ సాధ్యం కాదు.. అక్కడి రాజకీయ విధానం కూడా ఇక్కడ లేదు. మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి జరగదన్నారు. అంతిమంగా రైతులు నష్టపోతున్నారు.. వారికి న్యాయం జరిగే వరకు జనసేన అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు.. నేడు వారికి వైసీపీ ప్రభుత్వమే న్యాయం చేయాలన్నారు. 

ఆడవాళ్లు, పెద్దవాళ్లు, రైతులు, పిల్లలు అని చూడకుండా వారిపై లాఠీ ఛార్జి చేయించారు.అమరావతి ఉద్యమానికి తన మద్దతు వుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు  జరిగితే.. వాటిని సరి చేయాలే తప్ప... ఇలా వ్యవహరించడం కరెక్టు కాదని, టీడీపీ, వైసీపీ ఆధిపత్య పోరులో.. రైతులు నలిగిపోవడం దారుణం అన్నారు. సీఎం జగన్ రెడ్డి.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు.,,ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతికి ఎందుకు అనుకూలమన్నారు.అప్పుడే  మూడు రాజధానులు అని ఎందుకు చెప్పలేదు.. చెబితే రైతులు కూడా భూములు ఇచ్చేవారు కాదేమో అన్నారు. 

రైతులు పెట్టే కన్నీరు.. ప్రభుత్వాలకు మంచిది కాదు వారికి న్యాయం జరగాలి. రాష్ట్ర హోం మంత్రే దళిత వర్గానికి చెందిన మహిళ.. కానీ తరచూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. గతంలో డాక్టర్ సుధాకర్ పై బలంగా పని చేసిన వ్యవస్థ.. ఇప్పుడు దళిత వర్గాలపై దాడులు చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు. పోలీసు వ్యవస్థ కూడా చట్టపరంగా పని చేయకపోతే వారిపై ప్రజలకు నమ్మకం సడలిపోతుందన్నారు పవన్. ట్రైనీ ఎస్సైలపై చర్యలు తీసుకోవడం కాదు.. అసలు ఆ సంఘటనలకు కారణం ఎవరో వారిపై చర్యలు తీసుకోవాలి. కరోనా కారణంగా ప్రధాని చేపట్టిన ఆత్మనిర్భర భారత్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. 

 

విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   2 minutes ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   an hour ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   14 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   14 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   16 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   17 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   19 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   a day ago


కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

   a day ago


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle