newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

పెళ్ళాల గోల... పవన్ పై జగన్ కామెంట్స్

10-12-201910-12-2019 08:38:27 IST
Updated On 10-12-2019 13:23:28 ISTUpdated On 10-12-20192019-12-10T03:08:27.894Z10-12-2019 2019-12-10T03:08:15.338Z - 2019-12-10T07:53:28.371Z - 10-12-2019

పెళ్ళాల గోల... పవన్ పై జగన్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇప్పుడు ఉల్లి లొల్లి... పెళ్లాల గోల మాత్రమే నడుస్తోంది. పాలన మాట అటుంచితే ఏపీలో టీడీపీ నేతలు ఉల్లి దండలతో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు.

ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరలకు ఉల్లిని అమ్ముతున్నామని సీఎం వివరణ కూడా ఇచ్చారు. హెరిటేజ్ ప్రస్తావన కూడా తెచ్చారు జగన్. అక్కడ కిలో 150-200 రూపాయలకు కిలో అమ్ముతున్నారని మండిపడ్డారు. 

మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే వుంది. ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్‌పై పవన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సందర్భం వచ్చిందంటే చాలు వైసీపీ నేతలు కూడా పవన్ పై కామెంట్లు చేస్తున్నారు. జగన్ పరోక్షంగా పవన్‌ను విమర్శిస్తునే వున్నారు. తాజాగా పవన్ పెళ్లిళ్ల గురించి ఆయన పేరు ఎత్తకుండానే మాట్లాడుతున్నారు. 

అసెంబ్లీలో సోమవారం మహిళల భద్రతపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. పనిలో పనిగా పవన్ పై పరోక్షంగా మాటల తూటాలు పేల్చారు.

కొంతమంది పెద్ద పెద్ద నాయకులు తమకు ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు భార్యలు కావాలన్నట్టుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులను ‘బిగమీ’ అంటారని.. ఈ కేసులు రాష్ట్రంలో 2016లో 240, 2017లో 260, 2018లో 195 కేసులు నమోదయ్యాయి అన్నారు. 

గతంలో అనేక సార్లు పవన్ పెళ్ళిళ్ళ గురించి, పెళ్లాల గురించి, పిల్లల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తనపై వచ్చిన విమర్శలను పవన్ తిప్పికొట్టారు కూడా. తన మూడు పెళ్ళిళ్ళ వల్లే జగన్ జైలుకెళ్ళారని ఎద్దేవా కూడా చేశారు.

తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన జగన్ దిశ తల్లిదండ్రుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. వారి బాధను చూశాక.. నిందితులను కాల్చేసినా తప్పులేదని అందరం అనుకున్నామన్నారు.

21 రోజుల్లో శిక్షలు విధించేలా చట్టాలు రావాలన్నారు. నిందితులకు శిక్ష విషయంలో పవన్ గతంలో చేసిన కామెంట్లను ప్రస్తావించారు. తనకూ ఇద్దరు ఆడపిల్లలు, చెల్లెలు, భార్య ఉన్నారని .. పవన్ కళ్యాణ్ లా ముగ్గురు భార్యలు, నలుగురైదుగురు పిల్లలు లేరన్నారు. అయితే తనకు  ఒక్కతే భార్య అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంతో సభలో వైసీపీ సభ్యులు నవ్వులతో హోరెత్తించారు. 

అయితే,  బాధ్యతగల హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఇలాంటి ప్రస్తావన తేవడంపై, పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడంపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి ఇలాంటి కామెంట్లు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle