newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

పెరిగిన ఓట్లు ఏపార్టీకి గెలుపు మెట్లు..?

13-04-201913-04-2019 12:31:35 IST
Updated On 13-04-2019 17:12:45 ISTUpdated On 13-04-20192019-04-13T07:01:35.688Z13-04-2019 2019-04-13T07:01:33.937Z - 2019-04-13T11:42:45.076Z - 13-04-2019

పెరిగిన ఓట్లు ఏపార్టీకి గెలుపు మెట్లు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం బాగా పెరిగింది. మహిళలు, వృద్ధులు పోలింగ్ స్టేషన్లకు వచ్చి మరీ ఈవీఎంలు ఇబ్బంది పెట్టినా ఓపికగా ఓటేసి వెళ్ళారు. కొన్నిచోట్ల రెండుమూడు సార్లు పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఈవీఎంల గురించి తెలుసుకుని మరీ ఓటేసి వెళ్ళారు. కొందరు మహిళలు సైతం అర్థరాత్రి వరకూ  లైన్లో నిలబడి మరీ ఓటేశారు. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలు ప్రధాన పార్టీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా జనసేన సాధించే ఓట్లు టీడీపీ, వైసీపీల్లో ఎవరికి గండి కొడతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కేవలం ఒక్కశాతం పెరిగింది. సాధారణంగా పోలింగ్ శాతం పెరగడాన్ని ప్రభుత్వ వ్యతిరేకత ఓటుకి నిదర్శనంగా పరిశీలకులు అంటుంటారు. కానీ ఈసారి ఈ పెరిగిన ఓట్లు తమ నిబద్ధతకు, పనితీరుకి నిలువుటద్దాలు అని అధికార పార్టీ నేతలు గెలుపుపై ధీమాతో వున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తమవైపు ఉన్నారని, పసుపుకుంకుమ, ఇతర సంక్షేమ పథకాలు, పింఛన్లు ... కింద చేకూరిన లబ్ధికి తమకు గిఫ్ట్‌గా ఓట్లు వేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గెలుపుపై టీడీపీ నేతలంతా ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగా ఈ ఓట్లన్నీ తమకే పడ్డాయా అనే అనుమానం ఒకింత వారిలో గుబులును రేపుతోంది. ఇటు వైసీపీ నేతలు కూడా మహిళా ఓట్లు తమకే పడ్డాయని, తమ అభ్యర్ధులంతా మంచి మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు. 

చంద్రబాబు తమకు 130 సీట్లు గ్యారంటీ అని చెబుతున్నా.. లోలోపల కాస్త అనుమానాలు టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇందుకు చంద్రబాబు చర్యలు నిదర్శనాలుగా మారుతున్నాయి. గెలుస్తామని ధీమా వున్నప్పుడు ఈసీపై విమర్శలు చేయడం దేనికి సంకేతం అంటున్నారు. ఇటు వైసీపీ నేతలు సైతం తమకు 120 సీట్లు వస్తాయని అంటున్నారు. ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిషోర్ టీంతో జగన్ జరిపిన సమావేశంలోనూ జగన్ వైసీపీ గెలుపుపై పూర్తి విశ్వాసం వ్యక్తంచేశారని చెబుతున్నారు. 

ఇది ఇలా ఉంటే.. భారీ జరిగిన పోలింగ్ శాతాలు తమకే అనుకూలమంటూ టీడీపీ, వైసీపీ ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ప్రకాశం (85.93) , గుంటూరు (82.37), పశ్చిమగోదావరి (82.19), కృష్ణా(81.12 ), అనంతపురం (81.9), చిత్తూరు (81.3), విజయనగరం (80.68), తూర్పుగోదావరి (80.08) 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అత్యల్ప ఓటింగ్ నమోదైన జిల్లాల్లో విశాఖపట్నం (71.81), శ్రీకాకుళం (75.14), నెల్లూరు (76.68), కడప (77.21) , కర్నూలు (77.68) ఉన్నాయి. ఈ లెక్కన అత్యధిక పోలింగ్ శాతాలు నమోదైన జిల్లాల్లో విశాఖ మినహా మిగతా జిల్లాలన్నీ దాదాపుగా కాపు ఓటర్ల జనాభా ఎక్కువగా ఉన్నవేనని అంటున్నారు. వారంతా తమ గ్లాస్ గుర్తుకు ఓటేశారని జనసేన నేతలు ధీమాతో వున్నారు.  

పలు జిల్లాల్లో పెరిగిన ఓటింగ్ శాతాలు స్ధానికంగా ఉన్న కాపు ఓటర్లు జనసేన ప్రభావంతో ముందుకు రావడం వల్లే జరిగిందనే అభిప్రాయం స్ధానికంగా వ్యక్తమవుతోంది. దీన్నే జనసేన వర్గాలు సైలెంట్ ఓటింగ్‌గా అభివర్ణిస్తున్నాయి. వీరి ఓట్లే తమకు ఊహించని ఫలితాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నాయి. అలాగే మైనార్టీ ఓటర్లపై గంపెడాశలు పెట్టుకున్న వైసీపీ కూడా పలు జిల్లాల్లో మైనారిటీ ఓటింగ్ తగ్గడంతో కాస్త ఆందోళన చెందుతోంది. చాలా చోట్ల వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లను జనసేన బాగానే చీల్చిందని ఈ చీలిక ప్రభావం మే 23న ఫలితాల్లో కనిపిస్తుందంటున్నారు. మొత్తం మీద పోలింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle