newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

పెద్ద‌ల స‌భ‌కు వీరేనా..?

02-08-201902-08-2019 13:27:02 IST
2019-08-02T07:57:02.391Z02-08-2019 2019-08-02T07:56:59.520Z - - 21-01-2020

పెద్ద‌ల స‌భ‌కు వీరేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 

తెలుగు రాష్ట్రాల్లో మ‌రో ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ, తెలంగాణ‌లో ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌కు నోటీఫికేష‌న్ విడుద‌ల చేసింది ఎన్నిక‌ల సంఘం. తెలంగాణ యాద‌వ‌రెడ్డిపై అన‌ర్హ‌త వేటుతో ఖాళీ ఏర్పడింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్సీలుగా ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా క‌ర‌ణం బ‌ల‌రాం, వైసీపీ ఎమ్మెల్యేలుగా ఆళ్ల నాని, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి విజ‌యం సాధించారు. దీంతో వీరు రాజీనామా చేయ‌డంతో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.

తెలంగాణ‌లో ఖాళీ అయిన ఒక స్థానం టీఆర్ఎస్‌కు ద‌క్క‌నుంది. ఈ స్థానాన్ని మాజీ ఎంపీ, రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఆయ‌న ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిశారని స‌మాచారం. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మూడు స్థానాలూ ఎమ్మెల్యే కోటాలోనే ఖాళీ అయ్యాయి.

ప్ర‌స్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మూడు స్థానాలూ వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. టీడీపీ పోటీ పెట్టే అవ‌కాశం కూడా లేక‌పోవ‌డంతో ముగ్గురు వైసీపీ స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో ఈ మూడు ఎమ్మెల్సీలు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎవ‌రికి ఇస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇవ్వ‌లేక‌పోయిన ప‌లువురు నేత‌ల‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ ప‌ద‌వి హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల వేళ వైసీపీలో చేరి పార్టీ విజ‌యానికి కృషి చేసిన వారికి సైతం జ‌గ‌న్ నుంచి ఎమ్మెల్సీ ప‌ద‌విపై హామీ ఉంది. దీంతో ఈ మూడు ఎమ్మెల్సీల‌కు పోటీ బాగానే ఉంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేప‌ల్లె నుంచి ఓడినా మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. ఆరు నెల‌ల్లో ఆయ‌న ఎమ్మెల్సీ కావాలి కాబ‌ట్టి ఆయ‌న‌కు ఈ మూడింటిలో ఒక ఎమ్మెల్సీ ద‌క్క‌డం ఖాయం. మిగ‌తా రెండింటి కోసం ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల ముందు టీడీపీ ఎంపీగా ఉన్న పండుల ర‌వీంద్ర‌బాబు వైసీపీలో చేరారు. ఆయ‌న‌కు టిక్కెట్ ద‌క్క‌కున్నా పార్టీ విజ‌యం కోసం ప‌నిచేశారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇక‌, ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిన మ‌హ్మ‌ద్ ఇక్బాల్ రేసులో ముందున్నారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఇచ్చిన ఇఫ్టార్ విందులో పాల్గొన్న జ‌గన్ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇక‌, చిలుక‌లూరిపేట టిక్కెట్‌ను జ‌గ‌న్ మాట‌పై విడుద‌ల రజ‌నీకి వ‌దిలేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు కూడా ప్ర‌ధానంగా వినిపిస్తోంది.

ఎన్నిక‌ల ముందు పార్టీలో చేరిన క‌ర్నూలు నేత చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డికి కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరి పార్టీ విజ‌యానికి కృషి చేశారు. ఆయ‌న‌కు కూడా జ‌గన్ హామీ ఇచ్చి ఉన్నారు. రాజంపేట టిక్కెట్‌ను మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి కోసం వ‌దులుకున్న ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డికి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆ ప‌ద‌వి వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వ‌డంతో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తార‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు. మొద‌టి నుంచి ఆయ‌న వైఎస్ కుటుంబం వెంట ఉండ‌టంతో ఆయ‌న‌కు ప‌ద‌వి ఖాయ‌మంటున్నారు.

ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. ప్ర‌తీ విష‌యంలోనూ సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌ను చూసుకుంటున్న జ‌గ‌న్ ఎమ్మెల్సీల భ‌ర్తీ విష‌యంలోనూ చూస్తే మాత్రం ర‌వీంద్ర బాబు, ఇక్బాల్‌కు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి, జ‌గ‌న్ మ‌దిలో ఎవ‌రు ఉన్నారో త్వ‌ర‌లో తేల‌నుంది. 


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle