newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

పెద్ద‌లు.. ప్ర‌జ‌ల్లోనే తేల్చుకుంటారా..?

11-05-201911-05-2019 07:43:07 IST
Updated On 29-06-2019 11:51:18 ISTUpdated On 29-06-20192019-05-11T02:13:07.955Z11-05-2019 2019-05-11T01:59:42.248Z - 2019-06-29T06:21:18.297Z - 29-06-2019

పెద్ద‌లు.. ప్ర‌జ‌ల్లోనే తేల్చుకుంటారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లువురు ఎమ్మెల్సీలు ఈ ఎన్నిక‌ల‌ను అగ్ని ప‌రీక్ష‌గా భావించారు. ప్ర‌జ‌ల చేత ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని క‌ల‌లు కంటున్న వారంతా ఈసారి విజ‌యం కోసం తీవ్రంగా శ్రమించారు. ఇలా ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్ తో పాటు మంత్రులు నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, సీనియ‌ర్ నేత డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ ఉన్నారు.

మంత్రులు ముగ్గురూ వైసీపీ సిట్టింగ్ సీట్ల‌ నుంచి పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ సైతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతూనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకున్నా టీడీపీ ప్ర‌భుత్వంలో నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్ర‌య్యారు. ఈసారి ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొని విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలో నిలిచారు. 

అయితే, లోకేష్ ఎంపిక త‌ప్పు అనే అంచ‌నాలు ఉన్నాయి. ఇక్క‌డ ఆయ‌న‌కు వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గ‌ట్టి పోటీ ఇచ్చారు. మొద‌టిసారి పోటీ చేస్తున్న లోకేష్ టీడీపీకి ప‌ట్టున్న ఇంకేదైనా నియోజ‌క‌వ‌ర్గం ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక్క‌డ లోకేష్ గెలిచినా పెద్ద మెజారిటీ అయితే వ‌చ్చే అవ‌కాశం లేదు.

ఇక‌, మంత్రి నారాయ‌ణ సైతం అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకొని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఈసారి నెల్లూరు సిటీ నుంచి బ‌రిలో ఉండాల‌నే ముందు నుంచే ప్లాన్ చేసుకున్నఆయ‌న రెండేళ్లుగా అక్క‌డే దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు.

అయినా ఆయ‌న విజయం అంత సులువుగా ఏమీ క‌నిపించ‌డం లేదు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీతో గ‌ట్టెక్కే అవ‌కాశం ఉంది.

వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి ఈ ఎన్నిక‌లు నిజంగా అగ్నిప‌రీక్ష వంటివే. ఇప్ప‌టికే వ‌రుస‌గా నాలుగుసార్లు ఓడిపోయిన ఆయ‌న ఈసారి ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో స‌ర్వేప‌ల్లి నుంచి పోటీ చేశారు. ఇందుకోసం ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. 

ఆయ‌న‌కు విజ‌యం అంత సులువుగా క‌నిపించ‌డం లేదు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. ఆయ‌న సోమిరెడ్డికి గ‌ట్టి పోటీ ఇచ్చారు. 2014 నుంచి సోమిరెడ్డిని కాకాని ఇరుకున పెడుతూనే ఉన్నారు. 

సీనియ‌ర్ నేత డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి బ‌రిలో ఉన్నారు. ఇక్క‌డ త్రిముఖ పోటీ ఉంది. వైసీపీ అభ్య‌ర్థి మేక‌తోటి సుచ‌రిత‌తో పాటు జ‌న‌సేన అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు ఇక్క‌డ పోటీ చేశారు. ప్ర‌ధానంగా సుచ‌రిత డొక్కాకు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి ఉంది. అయితే, టీడీపీ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉండ‌టంతో ఆయ‌న స్వ‌ల్ప మెజారిటీతో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది.

ఇక‌, వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్సీ మాత్ర‌మే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట నుంచి సీనియ‌ర్ నేత పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ పోటీ చేశారు. ఇక్క‌డ కూడా త్రిముఖ పోటీ ఉంది. దీంతో ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మొత్తంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎమ్మెల్సీలు ఎవ‌రూ క‌చ్చితంగా గెలుస్తార‌ని మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక‌, మంత్రులైతే వైసీపీ సిట్టింగ్ సీట్ల నుంచి పోటీ చేసి రిస్క్ తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle