newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

పెద్దిరెడ్డి ఫ్యామిలీ గెలుపు అవకాశాలెంత?

09-05-201909-05-2019 14:59:02 IST
Updated On 01-07-2019 11:28:40 ISTUpdated On 01-07-20192019-05-09T09:29:02.991Z09-05-2019 2019-05-09T09:29:00.715Z - 2019-07-01T05:58:40.676Z - 01-07-2019

పెద్దిరెడ్డి ఫ్యామిలీ గెలుపు అవకాశాలెంత?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పే నేత‌ల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ముందుంటారు. ఆయ‌న కుమారుడు మిథున్ రెడ్డి కూడా వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటారు. ఏ నాయ‌కుడినీ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలు పెట్టనివ్వని జ‌గ‌న్ పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబానిదే హ‌వా. గ‌త ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పుంగ‌నూరు నుంచి ఎమ్మెల్యేగా గెల‌వ‌గా ఆయ‌న కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు.

ఈసారి మ‌ళ్లీ వీరిద్దరు పోటీ చేయ‌డంతో పాటు పాటు రామ‌చంద్రారెడ్డి త‌మ్ముడు ద్వార‌కానాథ్ రెడ్డి తంబ‌ళ్లప‌ల్లె నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. దీంతో ఒకే కుటుంబానికి జ‌గ‌న్ మూడు టిక్కెట్లు క‌ట్టబెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో పెద్దిరెడ్డి కూడా అంతే బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు పొందారు. ఆయ‌న ప్రభావం జిల్లా మొత్తం ఎంతో కొంత ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డితో సైతం ఆయ‌న‌కు పొస‌గ‌దు. 

2009 నుంచి 2014 వ‌ర‌కు ముఖ్యమంత్రి కిర‌ణ్‌, ప్రతిప‌క్ష నేత చంద్రబాబు జిల్లాకు చెందిన వారే అయినా పెద్దిరెడ్డి సైతం వారికి స‌మానంగా చ‌క్రం తిప్పారు. ఈ ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాల‌ని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ర‌చించింది. రామచంద్రారెడ్డిపైన మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి కుటుంబం నుంచి అనూషారెడ్డిని నిల‌బెట్టారు. ఆమె బాగా ప్రచారం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో రామ‌చంద్రారెడ్డి ఏకంగా 31 వేల మెజారిటీతో విజ‌యం సాధించారు. 

ఈసారి అనూష‌రెడ్డి గ‌ట్టి పోటీ ఇచ్చార‌నే అంచ‌నాలు ఉన్నాయి. అయితే, రామ‌చంద్రారెడ్డి మెజారిటీ త‌గ్గే అవ‌కాశం ఉన్నా ఆయ‌న గెలుపు మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, రాజంపేట‌లో మిథున్ రెడ్డిపైన చిత్తూరు ఎమ్మెల్యే డీకే స‌త్యప్రభ‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆమె యువ‌నేత‌తో పోటీ ప‌డ్డారు. రాజంపేట ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాయ‌చోటి, రైల్వే కోడూరు, రాజంపేట నియోజ‌క‌వ‌ర్గాలు క‌డప జిల్లాలోనివి. ఇక్కడ వైసీపీ బ‌లంగా ఉంది. 

ఇక‌, చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగ‌నూరు, మ‌ద‌న‌ప‌ల్లె, పీలేరులోనూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తంగా ఈసారి కూడా మిథున్ రెడ్డికి విజ‌యం సాధించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. ఇక‌, తంబ‌ళ్లప‌ల్లె నుంచి ద్వార‌కానాథ్ రెడ్డి మొద‌టిసారి పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది. ద్వార‌కానాథ్ రెడ్డి స్థానికేత‌రుడు అనే ముద్ర ఉంది. అయితే, ఆయ‌న గ‌ట్టి పోటీ ఇచ్చారు.

ఇక్కడ టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే  శంక‌ర్ యాద‌వ్, ద్వార‌కానాథ్ రెడ్డి మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగింది. ఎవ‌రు గెలిచినా స్వల్ప మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. మొత్తంగా ఈసారి కూడా పెద్దిరెడ్డి కుటుంబంలో ఇద్దరు చ‌ట్టస‌భ‌ల్లో అడుగుపెట్టడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక‌వేళ వీరు గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ప్రభుత్వంలోనూ వీరు కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle