newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

పెద్దాపురంలో ఎగిరేది ఏ జెండా?

30-04-201930-04-2019 08:31:14 IST
2019-04-30T03:01:14.422Z30-04-2019 2019-04-30T03:00:34.976Z - - 22-09-2019

పెద్దాపురంలో ఎగిరేది ఏ జెండా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఫలితాలపై ఇటు చంద్రబాబు, అటు వైఎస్ జగన్ టెన్షన్‌తో ఉన్నారు. గతంలో వచ్చిన ఫలితాలే వస్తే తన సీఎం ఆశలు గల్లంతనే భావనలో ఉన్నారు జగన్. పెద్దాపురంలో గెలిచేది ఎవ‌రన్న దానిపై తూర్పు గోదావ‌రి జిల్లాలో తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి 10,663 ఓట్ల మెజార్టీతో గెలిచిన నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప, డిప్యూటీ సీఎంగా బాధ్యత‌లు నిర్వహించారు. అప్పటి ఎన్నిక ఆయ‌న‌కు న‌ల్లేరు మీద న‌డ‌కే అయినా, ఈసారి ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంద‌ట‌. 

ఎందుకంటే వైసీపీ ఇక్కడ బ‌లం పుంజుకోవ‌డంతో పాటు, మాజీ ఎంపీ తోట న‌ర్శింహం స‌తీమ‌ణి తోట వాణి, వైసీపీ అభ్యర్థిగా బ‌రిలో దిగారు. ఇక జ‌న‌సేన నుంచి కూడా బ‌రిలో దిగిన తుమ్మల రామ‌స్వామి చిన‌రాజ‌ప్పకు స‌వాల్ విసురుతున్నారు. చిన‌రాజ‌ప్పకు పెద్దాపురం సొంత నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా, గ‌త ఎన్నిక‌ల్లో అన్ని అంశాలు క‌ల్సి రావ‌డం ఆయ‌న‌కు ప్లస్ పాయింట్ అయ్యాయి. అయితే అభివ్రుద్ధి విష‌యంలో చిన‌రాజ‌ప్ప మీద స్థానికులు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ట‌. 

కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో సామర్లకోట, పెద్దాపురం మండలాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో పెద్దాపురం, సామర్లకోట రోడ్డు విస్తరణ, స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజి ఏర్పాటు, తాగు, సాగు నీటి వసతి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు చినరాజప్ప. అయితే ప్రజ‌లు ఆశించిన స్థాయిలో ప‌నులు జ‌ర‌గ‌లేద‌ని వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. 

ఇక పెద్దాపురంలో మున్సిపల్ పార్క్, బస్టాండ్, ఆర్ అండ్ బీ రోడ్లను బాగు చేయించిన ఘ‌న‌త చిన‌రాజ‌ప్పకే చెల్లింద‌ని వైసీపీ నేత‌లు కూడా ఒప్పుకుంటున్నార‌ట‌. అయితే స్వయానా చిన‌రాజ‌ప్ప దత్తత తీసుకున్న జే. తిమ్మాపురం గ్రామం ఇంకా మురికి కూపంలోనే ఉంద‌ని ఆరోపిస్తున్నారు. ఈ గ్రామ అభివృద్థి కోసం 12 కోట్ల రూపాయలను చినరాజప్ప విడుదల చేసినా, స్థానిక టీడీపీ నేత‌లు వాటిని స్వాహా చేశార‌ని చెబుతున్నారు. ఇక పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నియామ‌కం అనేది పూర్తి కాలేదు. 

మ‌రో విష‌యం ఏంటంటే, పెద్దాపురం నియోజకవర్గంలో అడ్డగోలుగా రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా వెనుక టీడీపీ నేత‌లు ఉన్నారనేది స్థానికంగా ఉన్న ఆరోప‌ణగా తెలుస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో కూడా జ‌నం ఎగ‌బ‌డి ఓట్లేశారు.  మొత్తానికి ఈ ఎన్నికలు ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు టైట్ ఫైట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక చిన‌రాజ‌ప్ప, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కూతురు  తోట వాణి ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నరాజప్ప గట్టెక్కుతారని టీడీపీ నేతలు ధీమాగా ఉంటే... వైసీపీ నేతలు మాత్రం హోంమంత్రిని ఇంటికి పంపడం ఖాయం అంటున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle