newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

పెద్దలు మాట్లాడినా సయోధ్య కుదరడం లేదా?

27-08-201927-08-2019 07:27:21 IST
Updated On 27-08-2019 07:27:39 ISTUpdated On 27-08-20192019-08-27T01:57:21.138Z27-08-2019 2019-08-27T01:54:35.648Z - 2019-08-27T01:57:39.302Z - 27-08-2019

పెద్దలు మాట్లాడినా సయోధ్య కుదరడం లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థ‌ర్ మ‌ధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఇద్ద‌రు నేత మ‌ధ్య స‌యోధ్య కోసం పార్టీ పెద్ద‌లు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్ర‌య‌త్నించినా కుద‌రడం లేదు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఇటీవ‌ల ఇది మ‌రింత పెరిగి ఒక‌రి కార్య‌క్ర‌మాల‌కు మ‌రొక‌రు హాజ‌రుకావ‌డం లేదు.

ఎస్సీ రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన నందికొట్కూరులో బైరెట్టి సిద్ధార్థ రెడ్డి వైసీపీ ఇంఛార్జిగా ఉన్నారు. అంత‌కు ముందు పార్టీకి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద దిక్కుగా ఉండే గౌరు వెంక‌ట్ రెడ్డి పార్టీ మారాక నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌తల‌ను పూర్తిగా భుజాల‌కెత్తుకున్న సిద్ధార్థ రెడ్డి స‌మ‌ర్థంగా ప‌నిచేశారు.

త‌న తాత, మాజీ మంత్రి శేష‌శ‌య‌నారెడ్డి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న అన‌తికాలంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ధైర్యంగా ముందుకు వెళుతూ ప్ర‌త్య‌ర్థి పార్టీని ఎదుర్కున్నారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పార్టీ టిక్కెట్ ఆర్థ‌ర్‌కు ద‌క్కింది. అసెంబ్లీలో చీఫ్ మార్ష‌ల్‌గా ప‌నిచేసిన ఆర్థ‌ర్‌.. 2009, 2014 ఎన్నిక‌ల్లో టిక్కెట్ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నించినా ద‌క్క‌లేదు. దీంతో 2019లో జ‌గ‌న్ ఆయ‌న‌కు టిక్కెట్ ఇచ్చారు.

మొద‌ట్లో సిద్ధార్థ రెడ్డితో ఆయ‌న‌కు మంచి సంబంధాలే ఉండేవి. నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిగా ఆర్థ‌ర్ గెలుపు కోసం సిద్ధార్థ రెడ్డి బాగానే శ్ర‌మించారు. సిద్ధార్థ రెడ్డికి భ‌విష్య‌త్‌లో మంచి అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చారు.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌దిలీలు, ప‌నుల విష‌యంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, సిద్ధార్థ రెడ్డి మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయి. సిద్ధార్థ రెడ్డి ఆధిప‌త్యం మ‌రీ పెరిగిపోవ‌డంతో ఆర్థ‌ర్‌కు ఇబ్బందిగా మారింది.

ముఖ్యంగా ఒక ఉన్న‌తాధికారిగా ప‌నిచేసిన ఆయ‌న సిద్ధార్థ‌రెడ్డి ఆధిప‌త్యాన్ని స‌హించ‌లేక‌పోతున్నారంట‌. త‌న ప‌నుల్లోనూ సిద్ధార్థ రెడ్డి జోక్యం చేసుకోవ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌డం లేదు. త‌న గెలుపులో సిద్ధార్థ పాత్ర ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా ఆధిప‌త్యం చ‌లాయించాల‌నుకోవ‌డం మాత్రం స‌రికాద‌నేది ఆయ‌న వాద‌న‌.

తాను ఆత్మ‌గౌర‌వం చంపుకోలేన‌ని సైతం ఆయ‌న ఒక ద‌శ‌లో పార్టీ పెద్ద‌ల‌కు చెప్పారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల పార్టీ, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఒక‌రు హాజ‌రైన కార్య‌క్ర‌మానికి ఇంకొక‌రు హాజ‌రుకావ‌డం లేదు.

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో ఎమ్మెల్యే హాజ‌ర‌వుతున్నా సిద్ధార్థ పాల్గొనే పార్టీ కార్య‌క్ర‌మాలకు హాజ‌రుకావ‌డం లేదు. సిద్ధార్థ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కోసం మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్ర‌య‌త్నించారు.

ఇద్ద‌రితోనూ మాట్లాడారు. అయినా వీరి మ‌ధ్య విభేదాలు త‌గ్గ‌లేదు. దీంతో ఇవి ఇంకెంత దూరం పోతాయో అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle