newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

పెథాయ్ తుపానుతో వణుకుతున్న ఏపీ

17-12-201817-12-2018 17:20:40 IST
Updated On 17-12-2018 18:51:20 ISTUpdated On 17-12-20182018-12-17T11:50:40.885Z17-12-2018 2018-12-17T11:50:39.044Z - 2018-12-17T13:21:20.584Z - 17-12-2018

పెథాయ్ తుపానుతో వణుకుతున్న ఏపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఏపీని వణికిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద మధ్యాహ్నం తీరాన్ని తాకిన తుపాను ...తిరిగి 3.30గంటల సమయంలో కాకినాడ-యానాం వద్ద మరోసారి తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ మన్యంలో భారీ వర్షం పడుతోంది.తుపాను ప్రభావంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని చోట్ల బస్సులు, రైళ్లు, విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలు, గాలుల తాకిడికి పలుచోట్ల సెల్‌టవర్లు పనిచేయడం లేదు. తుపాను ప్రభావంతో విశాఖలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖకు రావాల్సిన మొత్తం 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈదురుగాలులకు రోడ్లపై కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.  పునరావాస శిబిరాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో పెథాయ్‌ తుపాను తీవ్రతపై హోంమంత్రి చిన రాజప్ప అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల పశ్చిమగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

పెథాయ్‌ తుపాను పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచే తుపాను పరిస్థితులను సమీక్షించారు.  భారీ వర్షాల కారణంగా పాడైన విద్యుత్ లైన్లు, ఇతర సమాచార వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. తుపాను ప్రభావం ఒడిశాపై కూడా కనిపిస్తోంది. కోరాపూట్‌, మల్కాన్‌గిరి, రాయ్‌గడ, గజపతి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ్‌బంగాలోని కొన్ని ప్రాంతాల్లోనూ మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది. గత రెండు రోజుల నుంచే ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ముగ్గురు వృద్ధులు మరణించారు. మరోవైపు ‘పెథాయ్’ తుపాను తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్).  1100 కాల్ సెంటర్ ద్వారా బాధితులకు అవసరమయిన సాయం చేయడం, సందేహాలను తీర్చడం సమర్థవంతంగా నిర్వహిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle