newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

పృథ్వీ ఇలా చేస్తున్నారేంటి..? వైసీపీ సీరియ‌స్‌..!

12-01-202012-01-2020 08:45:28 IST
Updated On 13-01-2020 12:56:48 ISTUpdated On 13-01-20202020-01-12T03:15:28.179Z12-01-2020 2020-01-12T03:15:24.413Z - 2020-01-13T07:26:48.111Z - 13-01-2020

పృథ్వీ ఇలా చేస్తున్నారేంటి..? వైసీపీ సీరియ‌స్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సినీ న‌టుల మ‌ధ్య వార్ ముదురుతోంది. పృథ్వీ, పోసాని కృష్ణ‌ముర‌ళి మీడియా ముందుకొచ్చి మ‌రీ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. రాజ‌ధాని రైతుల‌పై పృథ్వీ  చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే వీరి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మైంది. అయితే, పృథ్వీ వైఖ‌రిపై వైసీపీ అధిష్ఠానం సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఆయ‌న‌పై చర్య‌ల‌కు కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

టాలీవుడ్‌లో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మ‌ద్ద‌తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒక‌రిద్ద‌రు మిన‌హా సినీ న‌టులు వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చే వారు కాదు. ఆ ఒక‌రిద్ద‌రు నాయ‌కుల్లో పృథ్వీ కూడా ఉండేవారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ పృథ్వీ పార్టీ గెలుపు కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. కొంత‌మంది న‌టుల‌తో బృందాన్ని ఏర్పాటు చేసుకొని ప్ర‌చారం నిర్వ‌హించారు. దీంతో పార్టీ అధికారంలోకి రాగానే పృథ్వీ క‌ష్టాన్ని గుర్తించారు జ‌గ‌న్‌. ఆయ‌న‌కు ఎస్వీబీసీ ఛాన‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ఈ ప‌ద‌వి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఉండేది. ఈ ప‌ద‌విలో ఉన్న వారు పూర్తిగా ఆధ్యాత్మిక‌త‌లో మునిగిపోతారు. కానీ, పృథ్వీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఆయ‌న రాజ‌కీయాల్లోనే చురుగ్గా ఉంటున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల‌ను ఉద్దేశించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి రైతుల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నార‌ని, ఆడి కార్ల‌లో తిరిగేవారు రైతులు ఎలా అవుతార‌ని ప్ర‌శ్నించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై రైతులు తీవ్రంగా మండిప‌డ్డారు. ఆయ‌న దిష్టిబొమ్మ‌ల‌ను సైతం ద‌హ‌నం చేశారు. తాజాగా మ‌రో సినీ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి సైతం ఈ వ్యాఖ్య‌లపై స్పందించారు. పృథ్వీ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

పృథ్వీ వ‌ల్ల మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను తిడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. దీనికి పృథ్వీ కూడా అంతే ఘాటుగా స్పందించి పోసానిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో వీరిద్ద‌రి వివాదం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత‌కుముందు కూడా వీరి మ‌ధ్య ఇటువంటి వివాద‌మే జ‌రిగింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు ఇష్టం లేద‌ని పృథ్వీ వ్యాఖ్యానించారు. దీనికి పోసాని కౌంట‌ర్ ఇచ్చారు. పృథ్వీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు.

దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌త్య‌క్షంగా వైసీపీలో చేర‌కున్నా ఆయ‌న జ‌గ‌న్‌కు అభిమాని. వివిధ సంద‌ర్భాల్లో వైసీపీకి అనుకూలంగా ఆయ‌న గ‌ట్టిగా మాట్లాడ‌తారు. దీంతో ఆయ‌న ప‌ట్ల జ‌గ‌న్‌కు సాఫ్ట్ కార్న‌ర్ ఉంది.

ఇటు, పృథ్వీ వైఖ‌రి ప‌ట్ల పార్టీ అసంతృప్తిగా ఉంది. ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌గా కూడా ఆయ‌న విఫ‌ల‌మ‌వుతున్నార‌ని పార్టీ భావిస్తోంది. త‌న తొంద‌ర‌పాటుతో పార్టీకి ఇబ్బందులు తెస్తున్నార‌ని పార్టీ అనుకుంటోంది. పైగా పోసాని కృష్ణ‌ముర‌ళిపైన తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం జ‌గ‌న్‌కు ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో ఆయ‌న‌పై చర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, రాజ‌ధాని రైతుల‌పై పృథ్వీ ఒక్క‌రే కాకుండా వైసీపీలో, ప్ర‌భుత్వంలో కీల‌క నేత‌లుగా ఉన్న వారు కూడా పృథ్వీ చేసిన విమ‌ర్శ‌లే చేశారు. మ‌రి, వారిపై కాకుండా కేవ‌లం పృథ్వీపైన మాత్ర‌మే అధిష్ఠానం సీరియ‌స్ అవ్వ‌డానికి ఆయ‌న‌పై ఉన్న అసంతృప్తి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   4 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle