newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

19-11-201919-11-2019 13:54:54 IST
Updated On 19-11-2019 13:54:52 ISTUpdated On 19-11-20192019-11-19T08:24:54.481Z19-11-2019 2019-11-19T08:20:19.381Z - 2019-11-19T08:24:52.346Z - 19-11-2019

పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు విజ‌య‌న‌గ‌రం మ‌హారాజుల రాజ‌కీయాల‌కు చేదు అనుభ‌వాన్నే మిగిల్చాయి. దీంతో వారి భ‌విష్య‌త్తు రాజకీయాల‌పై నీలి మేఘాలు క‌మ్ముకున్నాయ‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. రాజ‌కీయాల్లో గెలుపు.. ఓట‌ములన్న‌వి స‌హ‌జ‌మే అయినా విజ‌య‌న‌గ‌రం మ‌హారాజుల రాజ‌కీయ వార‌స‌త్వంపై మాత్రం అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఒకే ఎన్నిక‌ల్లో తండ్రి, కుమార్తె  ఇద్ద‌రూ ఓట‌మిపాల‌వ‌డం రాజుల‌కు కోలుకోలేని దెబ్బ‌గానే మిగిలింద‌న్న‌ది వాస్త‌వం.

టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వ‌స్తున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు త‌న కుమార్తె అతిది గ‌జ‌ప‌తిరాజు రాజ‌కీయ ఎంట్రీలోనే ఓట‌మిపాల‌వ‌డం ఆయ‌న‌కు తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. దీంతో ఆ కుటుంబ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అశోక్ గ‌జ‌ప‌తిరాజు రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కుమార్తె అతిధి గ‌జ‌ప‌తి కొన‌సాగించ‌గ‌ల‌రా..? ప్ర‌జ‌ల్లోకి ఆమె చొచ్చుకెళ్ల‌గ‌ల‌రా..? పూస‌పాటి వంశీయుల‌కు తిరిగి పూర్వ వైభ‌వం వ‌స్తుందా..? ఇప్పుడు పార్టీలోనూ..  జిల్లాలోనూ ఇదే టాక్ న‌డుస్తోంది. మొన్న‌టి ఎన్నికల్లో అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎంపీగా, కుమార్తె అతిధి గ‌జ‌ప‌తి ఎమ్మెల్యే అభ్య‌ర్ధులుగా బ‌రిలో నిలిచి ఘోర ఓట‌మిని చ‌విచూశారు.

ఓట‌మి భారం నుంచి కోలుకున్న ఈ తండ్రీ కూతురు కొన్ని రోజుల‌పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లూ చేశారు. ఎన్నిక‌ల్లో గెలుపు. ఓట‌ములు స‌హ‌జ‌మే అని, తామెప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటామ‌ని అన్న సంకేతాని ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.

కొన్ని రోజుల త‌రువాత అశోక్ గ‌జ‌ప‌తిరాజు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా హైద‌రాబాద్ వెళ్లిపోయారు. ఇక అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న జాడ లేదు. స్థానికంగా ఉన్న కుమార్తె అతిధి గ‌జ‌ప‌తిరాజు కొన్ని రోజుల‌పాటు బంగ్లాళాలోనే ఉంటూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేవారు. అయితే ఉన్న‌ట్టుండి ఆమె కూడా క‌నిపించ‌కుండా పోవ‌డంతో కార్య‌క‌ర్త‌ల్లో అయోమ‌యం మొద‌లైంది.

సుమారు రెండు నెల‌లుగా అశోక్ గ‌జ‌ప‌తిరాజు కుటుంబం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుండ‌టంతో పార్టీ కేడ‌ర్ కాస్తా డీలా ప‌డిపోయింది. అనారోగ్యంతో అశోక్‌గ‌జ‌ప‌తిరాజు న‌గ‌రానికి దూర‌మైనా.. ఆయ‌న రాజ‌కీయ‌వార‌సురాలైన కుమార్తె అతిధి గ‌జ‌ప‌తి కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని అయోమ‌య స్థితిలో కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

వాస్త‌వానికి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు ఉన్న గ్లామ‌ర్ కుమార్తెకు లేద‌న్న‌ది పోయిన ఎన్నిక‌ల్లోనే నిరూప‌ణ అయిందంటున్నారు రాకీయ విశ్లేష‌కులు. దీంతో ఆమె రాజ‌వంశ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తార‌న్న న‌మ్మ‌కం కార్య‌క‌ర్త‌ల్లోనూ క‌నిపించ‌డం లేద‌న్న భావ‌న అనుచ‌రులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

అశోక్ గ‌జ‌ప‌తి రాజు పూర్తి ఆరోగ్యంతో వ‌చ్చి తిరిగి పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా పాల్గొంటారా..?  లేక కుమార్తెకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

 

 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle