newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

పురందేశ్వరికి పాదాభివందనం

22-12-201822-12-2018 16:40:34 IST
Updated On 22-12-2018 16:40:32 ISTUpdated On 22-12-20182018-12-22T11:10:34.457Z22-12-2018 2018-12-22T11:07:50.562Z - 2018-12-22T11:10:32.023Z - 22-12-2018

పురందేశ్వరికి పాదాభివందనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న నందమూరి కుటుంబం కొన్ని కారణాల వల్ల విచ్ఛిన్నమైంది. దానికి రాజకీయం మరింత అగ్గిరాజేయడంతో... వారి మధ్య దూరం ఇంకా పెరిగింది. ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు వచ్చినా... మునుపటి ఆప్యాయత మాత్రం లేకపోయేది. బహుశా వీళ్ళిక కలవరేమో అనేంత దూరమైపోయారు. కానీ... కాలానికనుగుణంగా ఒక్కొక్కరూ మళ్ళీ దగ్గరవుతున్నారు. హరికృష్ణ మరణానంతరం అబ్బాయ్‌లని మళ్లీ అక్కున చేర్చుకున్నారు బాలయ్య! ఒక బాబాయ్‌గా తండ్రి లేని లోటు తీర్చడానికి వారికి దగ్గరయ్యారు. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా ఆడియో వేడుక మరుపురాని ఘట్టాలకు వేదికైంది. ఇందులో... అక్క పురందేశ్వరికి తమ్ముడు బాలయ్య పాదాభివందనం చేయడం ఒకటి! అవును... ఇన్నాళ్ళూ రాజకీయ విభేదాల కారణంగా దూరంగా ఉన్న అక్కాతమ్ముడు ఆ వేడుక సాక్షిగా ఒక్కటయ్యారు. బంధాలు, రాజకీయాలు వేరని చాటిచెప్పారు. గతంలో ఏ పరిణామాల వల్ల దూరమయ్యారో... మళ్ళీ అదే తండ్రి కారణంగా వీరి రక్తసంబంధం దగ్గరైంది.

ఈ సందర్భంగా తన తమ్ముడిపై ఎంత ప్రేమ ఉందో ప్రసంగంలో వివరించారు పురందేశ్వరి! బాలయ్య తనకంటే చిన్నవాడు కాబట్టి నమస్కారం చెప్పలేనని, ఆశీస్సులైతే కచ్ఛితంగా అందిస్తున్నానన్నారు. తెలుగువారికి తెలిసిన ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా రూపొందించడం నిజంగా సాహసమని, బాలయ్య చేసిన ఈ సాహసానికి తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ట్రైలర్ చూస్తున్నంతసేపు తనకు నాన్నగారే గుర్తొచ్చారని... అంతలా బాలయ్య తండ్రి పాత్రలో ఒదిగిపోయిన తన తమ్ముడ్ని చూసి గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్ కేవలం నందమూరి వంశస్తులకే కాకుండా తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి ఓ గుర్తింపు, వన్నెను తెచ్చిన మహానాయకుడని వెల్లడించారు. ఆయన స్వయంకృషికి సాక్షాత్కారమని, ఓ రాజకీయ ప్రభంజనమని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ఇలా అక్కడ మాట్లాడుతున్నంతసేపు బాలయ్య తథేకంగా చూడసాగారు. అలాగే బాలయ్య వేదికపై ప్రసంగిస్తున్నంతసేపు తమ్ముడిని ఆసక్తిగా గమనించారు. తండ్రి గొప్పతనం గురించి వేదికపై ఉన్న ప్రముఖులు చెప్తున్నప్పుడు ఆమె ఉద్వేగానికి గురయ్యారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle