newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

పునేఠాకు పోస్టింగ్.. మాజీ సీఎస్‌కే తప్పలేదు వెయిటింగ్

15-05-201915-05-2019 08:28:35 IST
Updated On 15-05-2019 08:32:26 ISTUpdated On 15-05-20192019-05-15T02:58:35.953Z15-05-2019 2019-05-15T02:47:25.626Z - 2019-05-15T03:02:26.432Z - 15-05-2019

పునేఠాకు పోస్టింగ్.. మాజీ సీఎస్‌కే తప్పలేదు వెయిటింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్లో కీలకమయినది సీఎస్ అనిల్ చంద్ర పునేఠా బదిలీ. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యల కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని కోల్పోయిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌చంద్ర పునేఠా అప్పటినుంచి ఇప్పటి వరకూ పోస్టింగులో లేకుండానే ఉన్నారు.

ఎట్టకేలకు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. మంగళవారం సాయం త్రం రాష్ట్ర ప్రభుత్వం అనిల్‌చంద్ర పునేఠాకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు సీఎస్‌ ఎల్వీఎస్‌ మూడు పర్యా యాలు పునేఠా పోస్టింగ్‌కు సంబంధించిన ఫైలు పంపారు. 

ఈనెల 31న పదవీవిరమణ చేయనున్నారు అనిల్‌ చంద్ర పునేఠా. దీంతో ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుండి ఏప్రిల్‌ 8వ తేదీ నుండి మే 6వ తేదీ వరకూ మూడు పర్యాయాలు ఫైల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం కోసం పంపించారని తెలిసింది.

మే 14న జరగబోయే కేబినేట్‌ సమావేశ వివరాలతోపాటు ‘పునేఠ’ పోస్టింగ్‌కు సంబంధించిన విషయాన్ని కూడా సీఎం దృష్టికి సీఎస్‌ ఎల్వీఎస్‌ తీసుకురావడంతో ఆయన ఆమోదం తెలిపారు. 

దీంతో మంగళవారం సాయంత్రం ఎట్ట కేలకు పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏప్రిల్‌ 5న కేంద్ర ఎన్నికల సంఘం అనిల్‌చంద్ర పునేఠను తప్పిం చి, ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించిన అనంతరం ఏప్రిల్‌ 8వ తేదీన తొలి ఫైల్‌ సీఎస్‌ కార్యాలయం నుండి సీఎంఓకు వెళ్లింది. 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఫైల్‌ ఆలస్యం కావడానికి అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు భావించారు.

కానీ పోలింగ్‌ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా మరో రెండు సార్లు పునేఠకు పోస్టింగ్‌ ఇవ్వాలని కోరినా సీఎం చంద్రబాబు దానిని ఆమోదించలేదు. ఈ పరిణామాలపై సీనియర్‌ ఐఏఎస్‌లు మొదలుకొని అధికారులంతా తీవ్ర అసంతృప్తితో ఉండటంతో పునేఠాకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఆయన కేవలం 15 రోజులే ఈ పదవిలో ఉండనున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle