newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

పుత్ర‌జ‌య‌తో పోలిక‌.. ఏపీకి భారీ న‌ష్ట‌మే..!

06-01-202006-01-2020 10:36:55 IST
Updated On 06-01-2020 12:24:06 ISTUpdated On 06-01-20202020-01-06T05:06:55.030Z06-01-2020 2020-01-06T05:06:51.740Z - 2020-01-06T06:54:06.844Z - 06-01-2020

పుత్ర‌జ‌య‌తో పోలిక‌.. ఏపీకి భారీ న‌ష్ట‌మే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్ర‌దేశ్ స‌మ‌గ్ర అభివృద్ధిపై సూచ‌న‌ల కోసం ఏర్పాటు చేసిన ఈసీజీ క‌మిటీ త‌న నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేసింది. దేశంతోపాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నంచేసి వాటి వివ‌రాల‌తో స‌హా నివేదిక‌ను అంద‌జేసింది. జీఎన్‌రావు నివేదిక‌ కంటే బీసీజీ నివేదిక చాలా వివరంగా ఉంద‌నే చెప్పాలి. అమ‌రావ‌తిలోనే అన్నీ ఉండాల‌ని అంటున్న‌వారు స‌మాధానం చెప్ప‌లేని అంశాల‌ను బీసీజీ త‌న నివేదిక‌లో పొందుప‌రిచింది. న‌గ‌రాల నిర్మాణం ఎంత వ‌ర‌కు లాభ‌దాయ‌కం అన్న‌దానిపై ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌త 40 ఏళ్ల‌లో నిర్మించిన న‌గ‌రాల ప‌నితీరు, అవి విఫ‌ల‌మైన తీరును నివేదిక‌లో బీసీజీ వివ‌రించింది.

రాజ‌ధానిని విశాఖ‌లోపెడితే ఇత‌ర ప్రాంతాల వారికి దూర‌మ‌వుతుంద‌న్న విమ‌ర్శ‌ల‌పైన బీసీజీ అధ్య‌య‌నం చేసి అందుకు స‌రైన సమాధానం చెప్పింది. అమ‌రావ‌తి నిర్మాణం గురించి కొన్ని కీల‌క‌మైన వ్యాఖ్య‌ల‌ను క‌మిటీ చేసింది. అమ‌రావ‌తి నిర్మాణ‌మ‌న్న‌ది ఒక విఫ‌ల ప్ర‌యోగం అని అభివ‌ర్ణించింది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ప్ర‌పంచంలో 1970 నుంచి నిర్మిత‌మైన న‌గ‌రాల‌ను ప్ర‌స్తావించింది.

ప్ర‌పంచంలో మొత్తం 30 న‌గ‌రాల నిర్మాణం జ‌ర‌గ్గా, అందులో కేవ‌లం చైనాలోని షంజైన్, భార‌త్‌లోని న‌వీ ముంబై మాత్ర‌మే 50 శాతం ల‌క్ష్యాన్ని చేరుకున్నాయ‌ని బీసీజీ వివ‌రించింది. నిర్మించిన 30 న‌గ‌రాల్లో ఎనిమిది న‌గ‌రాలు సున్నా ప‌నితీరుతో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని వివ‌రించింది. మ‌రో తొమ్మిది న‌గ‌రాలు కేవ‌లం 10 శాతానికి లోపు మాత్ర‌మే అంచ‌నాల‌ను అందుకుని భారీ న‌ష్టాల‌ను మిగిల్చిన‌ట్టు ఆయా ప‌ట్ట‌ణాల పేర్ల‌తో స‌మా బీసీజీ త‌న నివ‌దిక‌లో వెల్ల‌డించింది.

అమ‌రావ‌తిలో ల‌క్షా ప‌ది వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాలు అభివృద్ధికి దూరం కావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే రూ.2 ల‌క్ష‌లా 25 వేల కోట్లకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పు చేరింద‌ని, ఇప్పుడు అమ‌రావ‌తి కోసం భారీగా ఖ‌ర్చు చేస్తే ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవ‌డం ఖాయ‌మ‌ని బీసీజీ హెచ్చ‌రించింది. ల‌క్ష కోట్లు పెట్టి అమ‌రావ‌తిని నిర్మించినా దాని నుంచి ప్ర‌తిఫ‌లాలు 2045 సంవ‌త్స‌రం త‌రువాతే వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది.

2045 త‌రువాత కూడా అమ‌రావ‌తి నుంచి వ‌చ్చే ఆదాయం ఏడాదికి కేవ‌లం 8వేల కోట్లు నుంచి ప‌ది వేల కోట్లు వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని లెక్క క‌ట్టింది. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి కోసం తెచ్చిన అప్పుపై ఏటా తొమ్మిదివేల కోట్ల రూపాయ‌లు వ‌డ్డీ కింద చెల్లించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అంటే 2045 త‌రువాత అమ‌రావ‌తి నుంచి 8 వేల కోట్ల నుంచి ప‌ది వేల కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తే ఆ ఆదాయ‌మ‌న్న‌ది అప్పుకు వ‌డ్డీకింద స‌రిపోతుంది.

2045లో ప‌దివేల కోట్ల ఆదాయం అమ‌రావ‌తి నుంచి రావ‌డ‌మ‌న్న‌ది కూడా ఏటా ఆ ప్రాంతంలో జ‌నాభా వృద్ధి రేటు 15 శాతం నుంచి 16 శాతం వ‌ర‌కు ఉంటేనే సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌పంచంలో నిర్మించిన 30 న‌గ‌రాల అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మాత్రం జ‌నాభా వృద్ధి 15 శాతం అమ‌రావ‌తిలో ఉండ‌ట‌మ‌న్న‌ది దాదాపు అసాధ్య‌మ‌ని బీసీజీ స్ప‌ష్టం చేసింది.

చంద్ర‌బాబు నాయుడు అప్ప‌ట్లో అమ‌రావ‌తిని పుత్ర‌జ‌య‌లా నిర్మిస్తాన‌ని చెప్పేవారు. ఆ పుత్ర‌జ‌య ప‌రిస్థితి కూడా ఎలా ఉందో బీసీజీ త‌న రిపోర్టులో స్ప‌ష్టంగా వివ‌రించింది. మ‌లేషియా రాజ‌ధానిగా నిర్మించిన పుత్ర‌జ‌య‌లో 2012 నాటికే 5 ల‌క్ష‌లా 70 వేల మంది జ‌నాభా ఉంటార‌ని అంచ‌నా వేశారు. కానీ, ఆ అంచనాల‌న్నీ ఘోరంగా విఫ‌ల‌మై ఇప్ప‌టికి కూడా పుత్ర‌జ‌య జ‌నాభా కేవ‌లం 91 వేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని బీసీజీ బ‌య‌ట‌పెట్టింది.

అమ‌రావ‌తిలో ఏటా 15 శాతం జ‌నాభా వృద్ధి ఉంటుంద‌ని చేసిన అంచ‌నాల‌న్నీ కేవ‌లం ఊహాగానాలేన‌ని వాస్త‌వానికి అది ఏమాత్రం ద‌గ్గ‌ర్లో లేద‌ని బీసీజీ స్ప‌ష్టం చేసింది. ల‌క్ష కోట్లు తెచ్చి ఒక్క‌చోటే కుమ్మ‌రించ‌డం కంటే ఆ డ‌బ్బుతో పోల‌వ‌రం, రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల‌కు సంబంధించిన ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను నిర్మిస్తే ఐదేళ్ల‌లోనే వాటి ప్ర‌తిఫ‌లం అందుకోవ‌చ్చ‌ని బీసీజీ వివ‌రించింది. సాగునీటి ప్రాజెక్టుల‌పై డ‌బ్బు వెచ్చించ‌డం వ‌ల్ల రిస్క్ కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని సూచించింది.

అదే అమ‌రావ‌తిపై ల‌క్ష కోట్లు పెట్టినా 40 ఏళ్ల వ‌ర‌కు ప్ర‌తిఫ‌లాలు అంద‌క‌పోవ‌చ్చ‌ని రిస్క్ చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని వివ‌రించింది. ల‌క్షా 30 వేల కోట్లు ఖ‌ర్చుపెట్ట‌గ‌లిగితే రాష్ట్రంలో కొత్త‌గా 90 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని బీసీజీ వివ‌రించింది. అలా చేస్తే ఏపీ స్థూల ఉత్ప‌త్తి అమాంతం ల‌క్షా 50 వేల కోట్ల నుంచి రూ.2 లక్ష‌ల కోట్ల‌కు ఎగ‌బాకుతుంద‌ని నొక్కి చెప్పింది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle