newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

‘పుట్టగుంట’ భవంతి వైపు.. ‘నారా’ వారి చూపు..

28-06-201928-06-2019 21:10:34 IST
Updated On 28-06-2019 21:15:26 ISTUpdated On 28-06-20192019-06-28T15:40:34.826Z28-06-2019 2019-06-28T15:40:29.043Z - 2019-06-28T15:45:26.247Z - 28-06-2019

‘పుట్టగుంట’ భవంతి వైపు.. ‘నారా’ వారి చూపు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆరు ఎకరాల స్థలంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ఇంటిని ఏడు రోజులలోపు నిర్మూలించకపోతే తామే కూల్చేస్తామంటూ సీఆర్‌డీఏ అధికారుల నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంటి వేటలో వేగం పెంచారు.

అధ్యక్షుడి తాత్కాలిక నివాసం కోసం బెజవాడ బందరు రోడ్డులో ఇప్పటికే రెండిళ్లను పరిశీలించిన తెలుగుదేశం నేతలు తాజాగా యువ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీశ్ కుమార్ నివాసంపై దృష్టి పెట్టారు.  

విజయవాడలో సంపన్నవర్గాల నివాస ప్రాంతమైన గురునానక్ నగర్ కాలనీలో ఇటీవలే పుట్టగుంట సతీశ్ కుమార్ ఈ ఇంటిని నిర్మించుకుని ప్రస్తుతం అందులో వుంటున్నారు. టీడీపీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌రావుకు స్వయంగా కజిన్ అయిన పుట్టగుంట సతీశ్ కుమార్ తన అభిరుచి మేరకు ఈ ఇంటిని అందంగా, అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్నారు.  

రాజధానిలో సొంతంగా ఇల్లు నిర్మించుకునే వరకు కనీసం ఒక ఏడాదిపాటు ఈ ఇంటిని వినియోగించుకోవడానికి తన సోదరుణ్ణి ఒప్పిస్తానని చెప్పి గద్దె రామ్మోహన్‌రావు మాటిచ్చిన పిమ్మట చంద్రబాబు కుటుంబ సభ్యులు స్వయంగా వెళ్లి ఈ భవంతిని పరిశీలించి వచ్చారు. అత్యంత ఆధునిక శైలిలో నిర్మించిన ఈ ఇల్లు వారికి తెగ నచ్చిందని సమాచారం. దాంతో రంగంలోకి దిగిన గద్దె రామ్మోహన్‌రావు, బుద్దా వెంకన్న సతీశ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

  Image may contain: one or more people and indoor

తను ఎంతో ముచ్ఛటపడి నిర్మించుకున్న ఇంటిని తెలుగుదేశం అధినేత కుటుంబానికి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ, ఉన్నఫళంగా ఖాళీ చేయడం ఎలా అనేదే పుట్టగుంట ఆలోచిస్తున్నారని తెలిసింది.

తను కొత్తగా నిర్మిస్తున్న ఫ్లాటులోకి మారాలంటే కనీసం రెండు నెలలైనా సమయం పడుతుందని పుట్టగుంట స్పష్టంచేసినట్టు ‘న్యూస్‌స్టింగ్’కు అందిన విశ్వసనీయ సమాచారం.  

దాంతో, పుట్టగుంట ఇంటితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందిన మరో భవంతిని కూడా నారా కుటుంబ సభ్యులు పరిశీలించారని చెబుతున్నారు.

ఈ రెండిళ్లలో ‘పుట్టగుంట’ ఇంటికే వారు మొగ్గు చూపుతున్నారు. సీఆర్‌డీఏ నోటీస్ దరిమిలా ఇప్పుడు ఇల్లు తక్షణం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ముంచుకురావడంతో పుట్టగుంట అడిగిన సమయం వరకు వేచివుంటారా.. లేక ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తారా అనేది చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle