newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

పీపీఏల విషయంలో జగన్ వెనకడుగు!

12-09-201912-09-2019 09:08:22 IST
2019-09-12T03:38:22.950Z12-09-2019 2019-09-12T03:38:07.567Z - - 15-11-2019

పీపీఏల విషయంలో జగన్ వెనకడుగు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంచి దూకుడు మీదున్న జగన్ .. వెనకడుగు వేస్తున్నారా?

పీపీఏల విషయంలో అందుకే అలా మారారా?

కేంద్రం హెచ్చరికలు పనిచేశాయా?

కేంద్రానికి రాసిన లేఖ వెనుక ఏం జరిగింది?

ఏపీ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకూ మంచిదూకుడు మీదున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ సర్కార్ ఇప్పుడిప్పుడే వాస్తవానికి దగ్గరగా వెళుతున్నట్టు అనిపిస్తోంది. వివాదంగా మారిన విద్యుత్‌ కొనుగోళ్ళ ఒప్పందాలపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. పాత పీపీఏల జోలికి వెళ్ళబోమని కేంద్రానికి స్పష్టం చేయడంతో పాటు ఇంకా ఖరారు కానీ ఒప్పందాలపైనే దృష్టి సారిస్తామని కేంద్రానికి రాసిన లేఖలో ఏపీ ప్రభు త్వం పేర్కొంది.

గత ఒప్పందాలలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని మాత్రమే సమీక్షిస్తామని ఇకపై కొత్తగా ఒప్పందం చేసుకునే వాటిలో మాత్రమే కొత్త ధరలు నిర్ణయిస్తామని ఏపీ ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. దీనిని బట్టి చూస్తుంటే పీపీఏల విషయంలో జగన్‌ ప్రభుత్వం ఒక మెట్టు కిందకి దిగినట్లు స్పష్టంగా అర్ధమవు తోంది. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక గత ప్రభుత్వ నిర్ణ యాలు, అవకతవకలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 

ముఖ్యంగా విద్యుత్‌ కొనుగోళ్ళ ఒప్పందంలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వాటిని రద్దుచేయాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అన్ని స్థాయిల్లో సమీక్షలకు దిగారు.

అయితే ఈ వ్యవహారాన్ని తప్పుపట్టిన టీడీపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పరోక్షంగా మద్దతు లభించింది. సీఎం జగన్‌ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. పీపీఏల రద్దు విషయంలో పున: పరిశీలన చేయాలని స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ కొనుగోళ్ళపై ఒప్పందం చేసుకున్న పలు సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 

అలాగే,  కేంద్ర విద్యుత్‌ శాఖ కూడా జగన్ ప్రభుత్వ తీరుని విమర్శించింది. పీపీఏల విషయంలో తొందరపాటు నిర్ణయం పనికి రాదని రాష్ట్రానికి సూచించింది.

అయితే పీపీఏల విషయంలో తమ నిర్ణయంలో మార్పు ఉండదని అనేక సందర్భాల్లో ఏపీ సర్కారు కరాఖండిగా చెబుతూ వచ్చింది. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందంలో టీడీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని కోట్లాది రూపాయలను తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు దారాదత్తం చేసిందని సీఎం జగన్‌ అనేక సందర్భాల్లో చంద్రబాబును టార్గెట్‌గా చేసి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

ప్రధానమయిన రాష్ట్ర సమస్యలకంటే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పీపీఏల వివాదమే విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీకి చేరింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలకు సంబంధించి పాతవాటిని పున: పరిశీలించే విషయమై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రానికి లేఖ రాయడం చర్చకు దారితీస్తోంది. ప్రజా ప్రయోజనాల విషయంలో ఒక మెట్టు ఎక్కడమే తప్ప దిగడం ఉండదని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పీపీఏల విషయంలో ప్రతిపాదిత ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి పునరుద్ఘాటించారు. 

విద్యుత్‌ పంపిణీ సంస్థలు రూ.20 వేల కోట్ల భారంతో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజలపై భారం మోపకూడదనే సమీక్షలకు దిగామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బతికిబట్టకట్టాలంటే ప్రక్షాళన తప్పనిసరన్నారు.

ఇప్పుడున్న పరిస్థితితో ముందుకెళితే విద్యుత్‌ ఉత్పాదన కంపెనీలకు చార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఉత్పత్తి కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని వివరించారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ విషయంలో అడుగు ముందుకే గానీ వెనక్కి ఉండదని మంత్రి బాలినేని చెప్పారు. మొత్తం మీద పీపీఏల విషయంలో జగన్ ప్రభుత్వ వైఖరి మారడం చర్చకు దారితీస్తోంది. కేంద్రం వత్తిడి వల్లే ఈ పరిణామం సంభవించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle