newssting
BITING NEWS :
*శబరిమలలో మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభం.. ఏపీ మహిళల్ని వెనక్కి పంపిన కేరళ పోలీసులు *ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో దూసుకుపోతున్న భారత్.. 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా*ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ యాజమాన్యం ...హైకోర్ట్ కు అఫిడవిట్ *రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్ఛాపురం పర్యటన రద్దు *సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు *మధ్యాహ్నం 2గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి... కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్*శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పోలింగ్‌..ఓటు హక్కు వినియోగించుకున్న 80 శాతం మంది ఓటర్లు

పీపీఏల విషయంలో జగన్ కేంద్రం మాట వినడం లేదా?

10-09-201910-09-2019 12:39:54 IST
Updated On 10-09-2019 15:18:36 ISTUpdated On 10-09-20192019-09-10T07:09:54.261Z10-09-2019 2019-09-10T07:09:39.216Z - 2019-09-10T09:48:36.104Z - 10-09-2019

పీపీఏల విషయంలో జగన్ కేంద్రం మాట వినడం లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో వైకాపా సర్కార్-కేంద్రానికి మధ్య పొసగడం లేదా?

అధికారంలోనికి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ సర్కార్ కేంద్రంతో పేచీకి సిద్ధపడుతోందా? 

ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. పోలవరం పీపీఏలు, పోలవరం టెండర్ల రద్దు వంటి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం తీరును కేంద్రం వ్యతిరేకిస్తున్నది. ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారంటూ కేంద్రం ఏపీ ప్రభుత్వానికి చిన్న సైజు వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వడమే కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలలో ఏదో ఇబ్బంది తలెత్తిందనడానికి సాక్ష్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును కేంద్రం తప్పుపడుతున్నది. 

పదే పదే చెప్పినా, కోర్టులు మొట్టికాయలు వేసినా తీరు మార్చుకోకపోవడమేమిటని నిలదీస్తున్నది. అయితే జగన్ సర్కార్ మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్రం సూచనలను, సలహాలను ఖాతరు చేయడం లేదు. హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ఏపీలోని జగన్ సర్కార్ తీరు పట్ల కేంద్రం అసహనం వ్యక్తం చేస్తున్నది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పీపీఏల సమీక్షకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలు జరిగాయనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని ఆయన కుండ బద్దలు కొట్టేశారు. ఇందుకు ఏపీ సర్కార్ కేంద్రం సూచనలను ఖాతరు చేయకుండా మొండిగా ముందుకు వెళ్లడమే కారణమని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. పీపీఏల విషయంలో ఇప్పటికే కేంద్రం పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. 

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా పీపీఏల విషయంలో రద్దు నిర్ణయం మంచిది కాదని సూచించారు. వారించారు. అయితే ఏపీ సర్కార్ వాటిని వేటినీ ఖాతరు చేయలేదు. దీంతో ఆయన ఈ సారి బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు.  అంతెందుకు స్వయంగా ప్రధాని మోడీ కూడా పీఏపీల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు  ఉంటేనే సమీక్షలతో ముందుకు వెళ్లాలని జగన్ కు సూచించారు.

దీనికి ఏపీ సర్కార్ సమీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంది. దీంతో సమీక్షలను వ్యతిరేకిస్తూ విద్యుత్ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. అలాగే కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకు వచ్చాయి. కోర్టు విద్యుత్ కంపెనీలకు అనుకూలంగా స్పందించి, ఒప్పందాల రద్దు కూడదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పీపీఏల విషయంలో ఎలాంటి అవకతవకలూ జరగలేదనీ, అలా జరిగాయనడానికి ఆధారాలు లేవనీ కేంద్రం కూడా నిర్ధారణకు వచ్చింది. 

ఏపీ సర్కార్ తీరు విషయంలో జపాన్, ఫ్రాన్స్ దేశాల నుంచి కేంద్రానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు అందాయి. ఎందుకంటే ఆయా దేశాల కంపెనీలు కూడా విద్యుత్ ఒప్పందాలలో భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో ఏపీలోని వైకాపా సర్కార్ తీరు ఆయా దేశాలతో దౌత్యపరమైన సమస్యలకు తావిచ్చేదిగా ఉందని కేంద్రం భావిస్తున్నది. అన్నిటికీ మించి అవకతవకలకు సంబంధించిన ఆధారాలుంటేనే సమీక్షలు జరపాలని స్వయంగా మోడీ చెప్పినా ఎటువంటి ఆధారాలూ లేకుండా జగన్ సర్కార్ సమీక్షలకు వెళ్లడం పట్ల కేంద్రం ఆగ్రహంగా ఉంది. పాత ప్రభుత్వంపై కక్ష సాధింపు తీరులో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్నదన్న భావన కేంద్రంలో ఏర్పడింది. 

రాజకీయ లెక్కలు తేల్చుకోవడానికి ఇది మార్గం కాదని ఏపీ సర్కార్ కు ఘాటుగానే తెలిపింది. అయినా కూడా కేంద్రం మాట వినడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా లేదని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధం అవుతున్నది. కోర్టులు, కేంద్రం కూడా వ్యతిరేకిస్తున్నా పీపీఏల విషయంలో జగన్ సర్కార్ మొండిగావ్యవహరిస్తున్నదని, ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న భావన పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఏపీ సర్కార్ దూకుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.! అధికారం చేపట్టిన తొలి రోజు నుంచీ జగన్ సర్కార్ పీపీఏల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నది. కేంద్రం సహకారం లేకపోవడం, కోర్టులలో రద్దు నిర్ణయానికి చుక్కెదురు కావడం నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఏం జరగబోతున్నది అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..!  కమ్మ వర్సెస్‌ కమ్మ!!

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..! కమ్మ వర్సెస్‌ కమ్మ!!

   40 minutes ago


అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

   2 hours ago


ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

   6 hours ago


దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   9 hours ago


కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

   11 hours ago


కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

   13 hours ago


పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

   13 hours ago


జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

   14 hours ago


తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

   15 hours ago


నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle