newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

‘పీకే’సిన జగన్

12-01-201912-01-2019 12:08:44 IST
2019-01-12T06:38:44.664Z12-01-2019 2019-01-12T06:38:41.805Z - - 21-08-2019

‘పీకే’సిన జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవన్, జగన్‌ల మధ్య జరుగుతున్న మాటలయుద్ధం మాట అటుంచితే... కొన్ని రోజులుగా ఈ ఇద్దరు నేతలు ఒక్కటవ్వొచ్చనే ప్రచారం విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. తెరముందు విమర్శలు చేసుకుంటున్న వీళ్ళిద్దరు... తెరవెనుక మాత్రం రహస్యంగా పొత్తు గురించిన కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఒక్కోసారి చీమ సహాయం కూడా కావలసి వస్తుంది’ అని జగన్ చెప్పినపటి నుంచే వీళ్ళు పొత్తు పెట్టుకోవచ్చనే అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా... వీళ్ళు ఖచ్చితంగా కలుస్తారనే వాదనలు మరింత బలోపేతమయ్యాయి. కానీ... ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని వైఎస్ జగన్ కొట్టిపారేశారు. పవన్‌తో పొత్తు పెట్టుకునే సంగతలా ఉంచితే... అసలు అతనితో ఇంతవరకూ మాట్లాడింది లేదని, కనీసం కలవనూ లేదని ఆయన వెల్లడించారు. తాను ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగుతానే తప్ప... పవన్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని తేల్చి పారేశారు.

ఇక ఇదే సమయంలో... వచ్చే ఎన్నికల్లో వైసిపిపై ‘జనసేన’ ప్రభావం ఏమాత్రం ఉండదని జగన్ తెగేసి చెప్పారు. పవన్ సెపరేట్‌గా పోటీ చేస్తే... బహుశా అభిమానించే వ్యక్తుల్లో కేవలం మెజారిటీ వాళ్ళే ఆయనకు ఓటు వేస్తారేమోనని, అంతే తప్ప భారీ స్థాయిలో ఓట్లు రావని ఆయన జోస్యం చెప్పారు. పవన్ వల్ల తమ ఓటు బ్యాంకు తగ్గదని, చంద్రబాబు ఓటు బ్యాంకు మాత్రం కచ్ఛితంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో పవన్ మద్దతు తెలపడం వల్లే టిడిపి గెలుపొందిందని, లేకపోతే తమ పార్టీనే అధికారంలోకి వచ్చేదని తెలిపారు. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే... తమ పార్టీకే ఎక్కువ ఓట్లు పడతాయన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని... పవన్ అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ వ్యతిరేకత ప్రభావం అతనిపై కూడా పడుతుందని... దీంతో తమకు వ్యతిరేక ఓట్లు కలిసొస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు, చంద్రబాబుకు మధ్యే పోటీ ఉంటుందని... పవన్ కేవలం నామమాత్రంగా మిగిలిపోతారని జగన్ వెల్లడించారు.

ఈమధ్యకాలంలో చంద్రబాబు చేస్తున్న స్టేట్‌మెంట్స్ చూస్తుంటే... టిడిపికి పవన్ మళ్ళీ దగ్గరవుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు జగన్! తెరముందు తాము విడిపోయినట్లుగా ఆ ఇద్దరూ నటిస్తున్నారని, సరిగ్గా ఎన్నికల సమయంలో ఆ నటన ముసుగు పక్కన పెట్టేసి వాళ్ళు ఒక్కటయ్యే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు కలిసి పనిచేస్తే తాను సంతోషిస్తానని... ఎందుకంటే వారి కలయిక తనకు అనుకూలంగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. ఇక టిఆర్ఎస్‌తో ఏపీలో వైసిపి పొత్తు పెట్టుకోనున్నట్టు వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle