newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

పీఏసీ గిరీ కోసం టీడీపీ నేతల గురి

23-07-201923-07-2019 08:17:07 IST
Updated On 23-07-2019 11:06:20 ISTUpdated On 23-07-20192019-07-23T02:47:07.015Z23-07-2019 2019-07-23T02:47:00.364Z - 2019-07-23T05:36:20.523Z - 23-07-2019

పీఏసీ గిరీ కోసం టీడీపీ నేతల గురి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మిని చ‌విచూసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బ‌య‌ట, అసెంబ్లీలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌నే ఎదుర్కుంటోంది. అసెంబ్లీలో 151 మంది స‌భ్యుల‌తో అధికార ప‌క్షం టీడీపీ కంటే ఏడు రెట్లు బ‌లంగా ఉంది.

దీంతో వైసీపీ వాయిస్ బ‌లంగా వినిపిస్తుండ‌గా టీడీపీ వాణిని బ‌లంగా వినిపించ‌లేక‌పోతోంది. చంద్ర‌బాబును ప‌దేప‌దే ఇబ్బంది పెట్టేలా వైసీపీ స‌భ్యులు వ్యాఖ్య‌లు చేస్తున్న టీడీపీ పెద్ద‌గా కౌంట‌ర్ చేయ‌లేక‌పోతోంది. ముగ్గురు, న‌లుగురు టీడీపీ స‌భ్యులు మిన‌హా అసెంబ్లీలో ఎవ‌రూ పెద్ద‌గా మాట్లాడ‌టం లేదు.

ఇంత‌కాలం అధికార ప‌క్షంలో ఉంటూ ప‌ద‌వులు అనుభ‌వించిన టీడీపీ నేత‌లు ప్ర‌తిప‌క్ష పాత్ర‌కు అంత‌గా అల‌వాటు ప‌డ‌లేదు. ఇంత‌లో ఓ క్యాబినెట్ ర్యాంక్ ప‌ద‌వి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఆశ‌లు పెంచుతోంది. ప్ర‌తిప‌క్షానికి ద‌క్క‌నున్న పీఏసీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. క్యాబినెట్ ర్యాంక్ ఉండే ఈ ప‌ద‌వి ప్ర‌తిప‌క్షానికి చాలా కీల‌కం. అధికార పార్టీని ఇరుకున పెట్టే అవ‌కాశం ఈ ప‌ద‌విలో ఉండే వారికి ఉంటుంది.

అయితే, క్యాబినెట్ ర్యాంక్ ప‌ద‌వి కావ‌డంతో ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేల్లో పోటీ తీవ్రంగానే ఉంది. కొంత‌మంది ఎమ్మెల్యేలే ఉన్నా స‌మ‌ర్థులుగా భావిస్తున్న నేత‌లు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుందా అనేది పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ప‌ద‌వి కోసం సీనియ‌ర్ ఎమ్మెల్యేలు గొరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, అచ్చెన్నాయుడు తీవ్రంగా పోటీ ప‌డుతున్నారు.

వీరిద్ద‌రూ అసెంబ్లీలో పార్టీని, చంద్ర‌బాబుపై మాట ప‌డ‌కుండా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. అధికార ప‌క్షానికి అంతోఇంతో కౌంట‌ర్ ఇవ్వ‌గ‌లుగుతున్నారు. దీంతో వీరిద్ద‌రూ ఈ ప‌ద‌వి త‌మ‌కే ద‌క్కుతుంద‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు.

అయితే, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అచ్చెన్నాయుడు కంటే సీనియ‌ర్ కావ‌డం, గ‌త ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న పీఏసీ ప‌ద‌వి త‌న‌కే వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు. వైసీపీ ప్ర‌భంజ‌నంలోనూ త‌మ కుటుంబం ఎదురీది విజ‌యం సాధించినందున ఈ ప‌ద‌వి త‌న‌కే వ‌స్తుంద‌ని అచ్చెన్నాయుడు భావిస్తున్నారు.

ఇక‌, విశాఖ‌ప‌ట్నం ఉత్త‌ర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు కూడా ఈ ప‌ద‌వి కావాల‌ని త‌న కోరిక‌ను అధినేత‌కు వినిపించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆయ‌న అసెంబ్లీలో గ‌ట్టిగా మాట్లాడ‌టం లేదు. టీడీపీలోనే ఉంటున్నా పార్టీకి మ‌ద్ద‌తుగా అసెంబ్లీలో నోరు తెర‌వ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం ఉంది.

అయితే, సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తాయ‌ని, పైగా ఆయ‌న పార్టీ ప‌ట్ల కొంత అసంతృప్తితో ఉన్నందున ఈ ప‌ద‌వి ఇచ్చి ఆయ‌న‌తో పాటు కాపు సామాజ‌క‌వ‌ర్గాన్ని కూడా కొంత చ‌ల్లార్చాల‌నే భావ‌న‌లోనూ చంద్ర‌బాబు ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, సెంటిమెంట్ ప్ర‌కారం ప్ర‌భుత్వం మారిన గంటాకు మాత్రం క్యాబినెట్ ప‌ద‌వి ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయ‌న‌కు ఈ సెంటిమెంట్ క‌లిసి వ‌చ్చిన ఈ ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు.

ఇక‌, అసెంబ్లీలో బ‌లంగా వాణి వినిపిస్తున్న పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు జూనియ‌ర్ అయినా పీఏసీ ఛైర్మ‌న్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది.

టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు వైసీపీ త‌ర‌పున పీఏసీ ఛైర్మ‌న్‌గా బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స‌మ‌ర్థంగా ప‌ని చేశారు. ఇప్పుడు అలాంటి స‌మ‌ర్థుడినే ఈ ప‌ద‌వికి ఎంపిక చేసి వైసీపీని ఇరుకున పెట్టాల‌నేది చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న. మ‌రి, ఆయ‌న దృష్టిలో ఎవ‌రు ఉన్నారో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle