newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

పిఠాపురంలో పవన్ మార్క్ పాలి‘ట్రిక్స్’

23-03-201923-03-2019 08:10:08 IST
2019-03-23T02:40:08.330Z23-03-2019 2019-03-23T02:39:53.720Z - - 17-07-2019

పిఠాపురంలో పవన్ మార్క్ పాలి‘ట్రిక్స్’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పిఠాపురంలో పవన్ మార్క్ రాజకీయం నడుస్తోందట. ఎందుకంటే విభిన్నతీర్పుకి పెట్టింది పేరైన పిఠాపురం జనం, ఈసారి పవన్ పార్టీ వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 47 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎన్ఎస్ఎన్ వర్మ, ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక వైసీపీ నుంచి పెండెం దొరబాబు, జనసేన నుంచి మాకినీడు శేషుకుమారి పోటీ చేస్తున్నారు.

గొల్లప్రోలు, యు. కొత్తపల్లి, పిఠాపురం మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆ తర్వాత శెట్టి బలిజ, పద్మశాలీలు, మత్య్సకారులు, నాయీ బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువ. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ, గత ఎన్నికల్లో సానుభూతితో గెలిచారన్నది వాస్తవం. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవట. అయితే జనానికి అందుబాటులో ఉంటారన్నపేరు, సంక్షేమ పథకాలను జనానికి దగ్గర చేశారన్ పేరుతో పాటు ఆర్థికంగా బలమైన నేత వర్మ. అందుకే ఈసారి గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమాగా ఉన్నారట.

ఇక గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా జనంతోనే ఉన్నారు వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు. జగన్ హవా, చంద్రబాబు మీదున్న వ్యతిరేకత తనకు కల్సొస్తాయని ఆయన చెబుతున్నారట. వీరిద్దరి సంగతి ఉన్నా, తమ విజయం గ్యారెంటీ అంటున్నారు జనసేన అభ్యర్థి మాకినీడు శేషకుమారి. కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో గతంలో పీఆర్పీ గెలిచింది. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ మార్క్ రాజకీయం, కాపుల మద్దతుతో తన విజయం ఖాయమని శేషుకుమారి విశ్వాసంతో ఉన్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle