newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

28-02-202028-02-2020 11:03:19 IST
2020-02-28T05:33:19.695Z28-02-2020 2020-02-28T05:33:16.020Z - - 03-07-2020

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఒకపక్క ప్రభుత్వం నిర్ణయాలతో అటు కోర్టులలో.. ఇటు ప్రజలలో చివాట్లు తింటున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా పెడదారినే పయనించాలనుకోవడం విస్తుపోయేలా చేస్తుంది. ఏకపక్షంగా తీసుకున్న చాలా నిర్ణయాలు ఇప్పటికే అప్రతిష్టను తెచ్చిపెట్టగా ఇప్పుడు తీసుకున్న మరో నిర్ణయం కూడా అలాంటిదే.

మార్చి మొదటి వారం నుండి రాష్ట్రంలో మొదలుకానున్న పరీక్షల కోసం గ్రామ, వార్డు వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా ఉపయోగించుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా ప్రకటించారు. అయితే ఈ ప్రభుత్వ నిర్ణయం అటు రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర విద్యాశాఖ, మేధావి వర్గాలలో ఒకింత ఆశ్చర్యానికి.. విస్మయానికి గురి చేస్తుంది.

ఎందుకంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకం పదవ తరగతి. అనంతరం ఇంటర్మీడియేట్ విద్య జీవితానికి వేసే కీలక అడుగు. అలాంటి కీలకమైన పరీక్షలకు ఇప్పటి వరకు ఉన్నత విద్యను అభ్యసించి విద్యా సంబంధిత రంగంలో ఉన్న వారినే ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే, ఇప్పుడు వారి స్థానంలో కేవలం వైసీపీ కార్యకర్త అనే అర్హత మాత్రమే ఉన్న వాలంటీర్లను నియమించడం విద్యావంతులకు కంపరం పుట్టిస్తుంది.

వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అయ్యారన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిన అంశమే. ఆ పార్టీ కీలకనేత విజయసాయి రెడ్డి లాంటివారు అయితే అప్పుడప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తుంటారు కూడా. మరి అలాంటి ఒకపార్టీ కార్యకర్తలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టెన్త్, ఇంటర్ పరీక్షలకు నిర్వాహకులకు బాధ్యతలను అప్పగిస్తే ఏమవుతుందన్నది ఇప్పుడు విద్యార్థి లోకం ముందున్న ప్రశ్న.

ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని రాష్ట్రంలో కొన్ని వర్గాలను బాధించినా.. మరికొన్ని నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధికి నిరోధకాలయినా అదంతా రాజకీయ ఆటలలో భాగంగానే కనిపించింది. కానీ, వాలంటీర్లే ప్రతిదానికి అనే ఇలాంటి నిర్ణయాలతో లక్షల మంది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టేలా ప్రవర్తించడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.

ఇన్విజిలేటర్ల చేతికి పరీక్షకు కొన్ని నిమిషాల ముందే ప్రశ్నాపత్రాలు చేరతాయి. ఇప్పుడున్న టెక్నాలజీలో లీకేజీకి కొన్ని సెకన్లు చాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇన్విజిలేటర్లలో ఒక్కరు చాలు మొత్తం విద్యార్థుల జీవితాలను రిస్క్ చేయడానికి.. ఇదే ఇప్పుడు విద్యార్థులలో ఆందోళనగా మారింది. మరోవైపు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఘోరంగా విమర్శలు తలెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఎలా వెళ్లనుందో చూడాల్సి ఉంది.

 

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   3 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   3 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   4 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   8 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   10 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   13 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   13 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   14 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   14 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle