newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

పావలా కోడికి ముప్పావలా మసాలా.. ఏపీ ఇసుక విధానం

28-10-201928-10-2019 20:31:01 IST
Updated On 29-10-2019 17:10:50 ISTUpdated On 29-10-20192019-10-28T15:01:01.479Z28-10-2019 2019-10-28T15:00:56.797Z - 2019-10-29T11:40:50.586Z - 29-10-2019

పావలా కోడికి ముప్పావలా మసాలా.. ఏపీ ఇసుక విధానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీని ఇప్పుడు పట్టిపీడిస్తున్న సమస్యలలో ఇసుక సమస్య అతిపెద్దది. దీని ప్రభావం రాష్ట్రంలో ఆ రంగంతో పాటు అనుబంధ రంగాలను అగాధంలోకి నెట్టేసింది. లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డారని ఉపాధి లేని కూలీలే మంత్రులను నిలదీసే పరిస్థితికి వచ్చింది. ఇక రాష్ట్ర ఆర్ధికరంగం మీద ఇసుక ప్రభావం ఎంతన్నది విడదీసి చూడలేము కానీ మేజర్ వాటా ఇవ్వక తప్పదనే చెప్పాలి.

అయితే అసలు ఇసుక విధానంలో జగన్ సర్కార్ చేసిన తప్పేంటి? నూతన విధానం తెచ్చినా ఎందుకు సరఫరా కావడం లేదు? డిమాండ్ మేర ఇసుక ఎందుకు అందుబాటులో ఉండడం లేదు? ఇసుక కొరత తీరేదెప్పుడు? అన్నది విశ్లేషించుకుంటే కేవలం ముందు చూపులేని తొందరపాటు నిర్ణయం.. పారదర్శకత కోసం చేతులు కాల్చుకోవడమే ప్రభుత్వ తప్పిదంగా కనిపిస్తుంది.

ముందుగా కొంచెం వెనక్కి వెళ్తే గత ప్రభుత్వ ఓటమి ముఖ్యకారణాలలో ఇసుక విధానంలో లొసుగులు కూడా ఒక కారణమే. కొత్త రాష్ట్రంలో నిర్మాణ రంగం.. రియల్ ఎస్టేట్ మూడు బిల్డింగులు.. ఆరు వెంచర్లుగా కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. పేరుకి ఉచిత పథకమే అయినా యూనిట్ ఇసుక 1200 నుండి 2000 ధర పలుకుతూ నేతలు, దళారుల జేబులు నింపింది.

ఆ ప్రభుత్వంలో నేతలు కొందరు ఇసుక విధానంలో చేసిన ఆగడాలు.. అడ్డుకున్న ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులను అప్పటి ప్రతిపక్షం ఒడిసి పట్టి ప్రజలలో వ్యతిరేకతనును రేకెత్తించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేశాక సీఎం జగన్ ఇసుక మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. లేచించే లేడికి పరుగు అన్నవిధంగా అనుకున్నదే తడవుగా పాత విధానాలను రాత్రికి రాత్రి రద్దు చేసి పారేశారు.

నూతన విధానం ఏదీ లేకుండా చేసిన రద్దుతో ఒక్కసారిగా నిర్మాణాలు ఆగిపోయాయి. అయితే ఇన్నాళ్లు ప్రతిపక్షంలో మగ్గిన నేతలు, దళారులు ఒక్కసారిగా అధికారం అండదండలతో బ్లాక్ మార్కెట్ లో ఇసుక సరఫరాకు తెరలేపారు. దీంతో యూనిట్ ధర పదివేలకు చేరింది. అది కూడా దొరకడం గగనమే అయింది. ఈలోగా కొత్త ఇసుక విధానం తెచ్చారు. కానీ పరిస్థితి మాత్రం మారడం లేదు.

దీనికి కారణం పాత విధానంలో ఇసుక రీచ్ ల నుండే లబ్ధిదారులు తవ్వుకెళ్ళేవారు. కానీ ఈ విధానంలో ప్రభుత్వ వెండార్లు రీచ్ ల నుండి తవ్వుకొచ్చి స్టాక్ పాయింటులో స్టాక్ పెడతారు. అక్కడ నుండి లబ్ధిదారులు కొనుగోలుచేయాల్సి ఉంది. ఇందుకుగాను రాష్ట్రం మొత్తం మీద 102 ఇసుక రీచ్ లను గుర్తించి అక్కడ నుండి స్టాక్ పాయింట్లకు ఇసుక చేరవేస్తుంది. ఇక్కడ నామమాత్రపు ధరలనే నిర్ణయించింది.

ఇక లబ్ధిదారులకు గాను వెబ్ సైట్ రూపొందించి అందులో రిజిస్టర్ చేసుకొని ఆర్డర్ చేస్తే స్టాక్ పాయింట్ల నుండి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ విధానానికి ప్రభుత్వం పెట్టుకున్న పేరు పారదర్శకం. అయితే మొత్తం ఈ విధానం పావలా కోడికి ముప్పావలా మసాలా అన్న చందంగా మారిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు కారణం ఎక్కడా లబ్ధిదారుని వరకు వెళ్లని పారదర్శకత.

దాదాపు వందరోజులకు పైగా బ్లాక్ మార్కెట్ లో ఇసుకను బొక్కి తిన్న దళారులు, నేతలు నూతన విధానంలో కూడా పాగావేసి అక్రమ రిజిస్ట్రేషన్లతో బ్లాక్ లోనే ఇసుకను గతి చేశారు. ఇక దీనికి తోడు రీచ్ నుండి స్టాక్ పాయింట్.. స్టాక్ పాయింట్ నుండి లబ్దిదారునికి డబుల్ లోడింగ్.. అన్ లోడింగ్ భారం కాగా.. అవసరానికి దగ్గర్లో స్టాక్ పాయింట్ కన్నా వినియోగం తక్కువగా ఉండే స్టాక్ పాయింట్ నుండి ట్రాన్స్పోర్ట్ కూడా పెను భారంగా మారింది.

అన్నీ కలిసి యూనిట్ ఇసుక ఎనిమిదివేల ధర పలుకుతుంది. గత ప్రభుత్వంలో రెండు వేలలోపే దొరికే ఇసుకను పారదర్శకత పేరుతో ఎనిమిది వేలు చేయడంతో నిర్మాణం భారమై గట్టి అవసరమైతే తప్ప ఇసుక జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా ఉపాధి పడిపోవడం.. అనుబంధ రంగాల వ్యాపారాలు మూతబడ్డాయి. మరి ఈ సమస్యకు పరిష్కారంగా మరో విధానం తెస్తారా? లేక పారదర్శకతలో మార్పులు చేస్తారా? అసలు సమస్యే లేదని బుకాయింపే కొనసాగిస్తారా?!!

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   11 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle