newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

పాల‌న‌లోనూ జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు

05-06-201905-06-2019 08:56:38 IST
2019-06-05T03:26:38.637Z05-06-2019 2019-06-05T03:26:34.847Z - - 21-08-2019

పాల‌న‌లోనూ జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు ఉండేవి. ముఖ్యంగా ఆయ‌న‌ది మొండివైఖ‌రి అని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించ‌డంతో పాటు స్వంత పార్టీ వారూ పెద‌వి విరిచేవారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత ఆయ‌న‌పై ఈ విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వ‌చ్చాయి. అయితే, ఆయ‌న అదే మొండి వైఖ‌రితో ఈ ఎన్నిక‌ల్లో పార్టీకి అఖండ విజ‌యాన్ని సాధించిపెట్టారు.

ఇప్పుడు ప‌రిపాల‌న‌లోనూ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అధికారం చేప‌ట్టి వారం రోజులు కూడా కాక‌ముందే ఆయ‌న తీసుకుంటున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. న‌వ‌ర‌త్నాలు, ఎన్నిక‌ల హామీల అమ‌లుకు జ‌గ‌న్ చాలా ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తొంది.

ఈ క్ర‌మంలో ఆయ‌న మొండి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే అప్పుల్లో, ఆర్థిక క‌ష్టాల్లో ఉంది. ఈ ద‌శ‌లో ఆయ‌న మ‌ద్య నిషేదంపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఆయ‌న వైఖరికి అద్దం ప‌డుతోంది. ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వైసీపీ అధికారంలోకి వ‌స్తే ద‌శ‌ల‌వారీగా మ‌ద్య నిషేదం చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రానికి ప్ర‌ధానంగా ఆదాయం మ‌ద్యం నుంచే వ‌స్తోంది. సుమారు 17 వేల కోట్ల వార్షిక ఆదాయం మ‌ద్యం నుంచి వ‌స్తోంది.

ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక ప‌రిస్థితుల్లో ఇంత ఆదాయాన్ని వ‌దులుకోవ‌డం చాలా క‌ష్టం. అయినా, ఈ విష‌యంలో జ‌గ‌న్ సీరియ‌స్ గా ఉన్నారు. చెప్పిన‌ట్లుగా ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌నిషేదం అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న గ్రామాల్లో ప్ర‌జ‌ల జీవితాల‌ను చిన్న‌భిన్నం చేస్తున్న బెల్టు షాపుల‌ను పూర్తిగా తొల‌గించాల‌ని అధికారుల‌కు సూచించారు.

మ‌ద్యం దుకాణాల సంఖ్య‌ను కూడా త‌గ్గించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అయితే, మ‌ద్యం ద్వారా ప్ర‌భుత్వం కోల్పోయే ఆదాయాన్ని పూడ్చేందుకు ఇత‌ర మార్గాల‌ను అన్వేషించాల‌ని ఆయ‌న సూచించినా అది అంత సులువైన విష‌యం కాదు.

ఇక‌, ఆశా వ‌ర్క‌ర్ల‌కు జీతాల పెంపుపై కూడా ఆయ‌న ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. వాస్త‌వానికి వారికి ఇప్పుడు నెల‌కు రూ.3 వేల మాత్ర‌మే అందుతుండ‌గా దానిని రూ.6 వేల‌కు పెంచాల‌ని కోరుతున్నారు. జ‌గ‌న్ మాత్రం వారికి పాద‌యాత్ర‌లో హామీ ఇచ్చిన‌ట్లుగా ఏకంగా రూ.10 వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

గ‌త మూడు నాలుగు రోజులుగా జ‌గ‌న్ స‌మీక్ష‌ల తీరు కూడా భిన్నంగా సాగుతోంది. ఆయ‌న స‌మీక్ష‌లు చేసిన అన్ని  శాఖ‌ల అధికారుల‌కు ఆయా శాఖ‌ల‌ను బ‌లోపేతం చేసి, మ‌రింత మెరుగ్గా ప‌నిచేసేలా అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు చేస్తున్నారు. మ‌రి, జ‌గ‌న్ తీసుకుంటున్న త‌న మార్క్ నిర్ణ‌యాలు ఏ మేర అమ‌లులోకి వ‌స్తాయో రానున్న రోజుల్లో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle