newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

పాలిటిక్స్ ఇన్ 30 డేస్ ! ... ఉరుము తరుముకొచ్చింది

12-03-201912-03-2019 18:40:06 IST
2019-03-12T13:10:06.149Z12-03-2019 2019-03-12T13:03:27.422Z - - 22-09-2019

పాలిటిక్స్ ఇన్ 30 డేస్ ! ... ఉరుము తరుముకొచ్చింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉరుము తరుముకొచ్చింది.. ఇంకెక్కడి టైం.. మీదకొచ్చిపడింది. పైగా ఈ తెలుగోడి మీదే ఫస్ట్ పడింది.. . మొదటి  విడత ఎన్నిక సరిగ్గా..స్ట్రెయిట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల మీదే  ఉరిమింది.  పోయిన ఏడాది.. . చంద్రశేఖర్రావు అనే కెసిఆర్ మాత్రం ఈ ఉరుమునుంచి.. పిడుగుపాటు నుంచీ ... తప్పించుకున్నాడు. ఆయన గెలిచేసి తన అసెంబ్లీ సీట్లను జేబులో వేసుకుని ఇప్పుడు కత్తి  తిప్పుతున్నాడు.  ఆ రోజున ముందుకు దూకి ...  గెలిచి .. ఖేల్ ఖతం చేసిపారేసాడు.. ఆ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం అక్కడ చంద్రబాబుబాబు మాత్రం చెయ్యలేకపోయాడు. అక్కడంత సీన్ లేదు కాబట్టి..! అందుకు తోడు తన ఫ్రెండ్స్ చెప్పినట్లుగానే  ...  తెలంగాణ ఎన్నికల్లో ,కాళ్ళూ వేళ్లూ పెట్టి...  ఒళ్ళంతా కాల్చుకున్న లేటెస్ట్ అనుభవాలు బాబువి!    

ఇవ్వాళ ఏపీలో పార్టీలన్నింటికీ  సర్దుకోవడానిక్కూడా  సమయం లేదు. ఈసీ కొట్టించిన షాక్ అది..!. ఒక్క సెకండ్.. జస్ట్ ఒక్కటంటే ఒక్క సెకండ్.. రేపు  ఏప్రిల్ 11న పోటీచేసినోడు... మే 23 దాకా తన జాతక ఫలితాల కోసం  ఆగాలి. అంటే సరిగ్గా 42 రోజులు. ఆ  ఓవోటేసినోడు కూడా  అంతే... ఒకటా రెండా.. వాడు కూడా సరిగ్గా 42 రోజులు ఊపిరి బిగపట్టాల్సిందే. అభ్యర్థులు ఎవరు..బీఫారాలు ఎప్పుడిస్తారు.. నామినేషన్లు..ఉపసంహరణలు.. ప్రచారం.. వగైరా వగైరా..!  వీటన్నింటికీ కలిపి సరిగ్గా 30 రోజులే సమయం. జస్ట్ 30 డేస్.. ! అసలు పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయా..? టీడీపీ,వైస్సార్సీపీ,జనసేన ఎట్సెట్రా ఎట్సెట్రా.. ఎవరైతేనేం ... కౌంట్ డౌన్ స్టార్ట్స్ .!

సమయం లేనప్పుడు ఎవడికి  అడ్వాంటేజ్ ? రూలింగోడికా...అపోజిషనొడికా? అధికారం చేతిలో ఉన్నోడికైతే ఎప్పుడూ లాభమే.  యంత్రాంగం చేతిలో ఉంటుంది. అవసరమైన సాయాలు  అందించడానికి వాళ్ళ అండదండలుంటాయి. బూత్ స్థాయిదాకా మంత్రాంగాలు చెయ్యొచ్చు.  పోలీసు బలగం  మన చెప్పు చేతల్లో ఉంటుంది. ఎన్నికల ముందు రోజు జరిగే అసలైన యవ్వారాలన్నీ గప్ చిప్‌గా జరగడానికి వాళ్ళే హెల్ప్ చేస్తారు. . కాబట్టి అధికార పార్టీకే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఈజీ ! ఎక్కడైనా ఎప్పుడైనా.. డెమొక్రసీ కమ్స్ విత్ ఏ ట్యాగ్  !!! 

అతి తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళు ఎలక్షన్లలో అడ్డంగా కిందపడతారు. ఒక జగన్ మోహన్ రెడ్డి కూడా అంతేనా? పోయి పోయి ఒక తెరాస కేటీయార్‌తో కలిసి ఫోటోలు దిగాడు. దోస్తీ నటించాడు.. . ఇంతకంటే పిచ్చితనం ఇంకోటుండదు. అప్పుడు  రాష్ట్రం రెండుగా  విడిపోయినప్పుడు...  నిరాహార దీక్షలు చేసి...  నానా హంగామా సృష్టించిన  జగన్ ఇప్పుడు అదే తెలంగాణ నాయకుడితో ఫోటో సెషన్సా ? ఎబ్సల్యూట్లీ  డిస్గస్టింగ్ ! ఇదీ జగన్ వ్యూహాత్మక తప్పిదం. ఈ లోటస్ పాండ్ రాజకీయం ఆంధ్రాలో వర్క్ అవుట్ అవుతుందా?  అయినా కేంద్రంలో ఒక మోడీ లేదా మోడీ లెస్ ప్రభుత్వానికి కెసిఆర్ పడుతున్న తాపత్రయానికి ఇక్కడ ఇంత హంగామా అవసరమా..? దానికి జగన్ లేదా ఆయన  తరఫున  సాయిరెడ్డి బూరలూదడం  అవసరమా ? 

చంద్రబాబు తన గేమ్ ప్లాన్ ... అదే పావుల్ని కరెక్టుగా కదుపుతున్నాడా? వయసు అయిపోతోంది కాబట్టి జాగ్రత్త పడుతున్నాడు.  ఇది తెలుస్తోనే ఉంది. కనిపిస్తూనే ఉంది. ఎలాగో అదృష్టంతో  నడిచొచ్చే కొడుకు రాలేదు..  . తోడల్లుడు కమ్ బావమరిది వర్కౌట్ అయ్యే అవకాశాలూ లేవు.. అసలు ఎన్టీఆర్ కుటుంబమే ఆయనకు ఇప్పుడొక నెగెటివ్ ! అయినా బాబు ఒక  సూపర్ స్ట్రాటెజిస్ట్ కాబట్టే ...  175 సీట్ల లెక్కలన్నీ పక్కాగా ప్లాన్లేసి తెగ్గొట్టేసి పారేసాడా? . కాకపోతే అక్కడ మాయా మశ్చీంద్రలు ఇంకా చాలామందే ఉన్నారు. ఇంక్లూడింగ్ అమిత్ షా..  ఈ షా ఎండ్ కో లది.. 'తాడు బొంగరాల సప్లయ్ అండ్ కంపెనీ'  .! అంత వీజీ కానేకాదు. 

ఒక్క మాట.. నేను లేస్తే సింహాన్ని..కానీ లేవలేకపోతున్న ఒక  పవన్ కళ్యాణ్ ... ఆయన పక్కనే నిలబడ్డ లెఫ్ట్ పార్టీలు.. చరిత్ర సృష్టించడం ఖాయం. అది ఏ చరిత్ర అన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి.. ! 

మళ్ళీ ఒకసారి.. నెలరోజులు కూడా లేని ఈ ఎన్నికలు.. 42 రోజులు దాకా ఆగాల్సిన ఈ ఫలితాలు... 

పాలిటిక్స్ ఇన్ 30 డేస్


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle