పాలన, ప్రక్షాళన ...భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
05-06-201905-06-2019 07:57:10 IST
Updated On 24-06-2019 16:29:32 ISTUpdated On 24-06-20192019-06-05T02:27:10.169Z05-06-2019 2019-06-05T02:27:03.185Z - 2019-06-24T10:59:32.343Z - 24-06-2019

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దూకుడు ప్రదర్శించారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాలనలో తనదైన ముద్రవేసేందుకు ముఖ్యమంత్రి జగన్ అధికారుల బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదా నుంచి జిల్లా కలెక్టర్ల వరకూ ఈ బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల కలెక్టర్లను మార్చారు. రాష్ట్రంలో మొత్తం 44 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. * ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్. * ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్. * జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్. * వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య * బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్. * పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ. * వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి. * గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము. * యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్. * పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్. * ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు. * స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి. * పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు. * ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్. * ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా. * జెన్ కో ఎండీగా బి. శ్రీధర్. *ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్. * సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్. *హోం సెక్రటరీగా కిషోర్ కుమార్ * వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి *అజయ్ జైన్ జీఏడీకి అటాచ్ *విజయానంద్ జీఏడీకి అటాచ్ *జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా * శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్. * మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న * ఎక్సైజ్ కమిషనర్ ఎం ఎం నాయక్. * సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్. * వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రవీణ్ కుమార్. * సీఎం ఓఎస్డీగా జే. మురళీ * సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుగా విజయ. * ట్రాన్స్ పోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు. * హార్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి * వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్. * ఇంటర్ విద్య కమిషనరుగా కాంతిలాల్ దండే. * మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్. *పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర్* *సీఆర్డీఏ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహం తొమ్మిది జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. విశాఖ కలెక్టర్- వి.వినయ్ చంద్, నెల్లూరు- ఎంవీ శేషగిరిరావు, ప.గో- ముత్యాలరాజు, కర్నూలు- జి.వీరపాండ్యన్, చిత్తూరు- నారాయణ భగత్ గుప్తా, గుంటూరు- శ్యామ్యూల్ ఆనంద్, తూ.గో- మురళీధర్ రెడ్డి, అనంతపురం- ఎస్.సత్యనారాయణ, ప్రకాశం- పి.భాస్కర్, కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లను ఎవరినీ బదిలీ చేయలేదు. ఇంత భారీస్థాయిలో అధికారుల బదిలీ తర్వాత పాలన ఎలా ఉంటుందో చూడాలి.

టీడీపీ కార్యాలయాన్ని.. కూల్చేయాల్సిందేనా!
2 hours ago

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ..!
3 hours ago

కలెక్టర్‌పై బదిలీవేటు! మంత్రితో తేడాలే కారణమా?
3 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శనలో విజయమ్మ, భారతి సందడి
3 hours ago

ఆ బ్రాండ్ల సంగతి నీకెందుకు తల్లీ వదిలేయ్!
4 hours ago

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!
7 hours ago

జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక
10 hours ago

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు
10 hours ago

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?
10 hours ago

ఉల్లికి తోడు పాల ధరలకు రెక్కలు
11 hours ago
ఇంకా