newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

పాలకొల్లులో ఎస్వీరంగారావు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్.. పవన్ ప్లాన్

01-07-201901-07-2019 07:35:30 IST
Updated On 03-07-2019 12:53:54 ISTUpdated On 03-07-20192019-07-01T02:05:30.854Z01-07-2019 2019-07-01T01:57:23.617Z - 2019-07-03T07:23:54.668Z - 03-07-2019

పాలకొల్లులో ఎస్వీరంగారావు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్.. పవన్ ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019ఎన్నికల్లో షాక్ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. తన అన్న చిరంజీవి అత్తగారి ఊరైన పాలకొల్లులో ఏదైనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలని నిర్ణయించారు. తెలుగు తేజాన్నివిశ్వవ్యాప్తం చేసిన దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరుతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించాలని నిర్ణయించారు.

దీనిని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రారంభించనున్నట్టు  పార్టీ ప్రకటించింది. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఇన్ స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి పాలకొల్లులో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. 

తర్వాత ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎన్నికల క్షేత్రంలో నిలిచారు. భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓడిపోయారు.కానీ స్వంత జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తేవాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆలోచన చేశారు.

చిరంజీవి మామగారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య, దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘనత పాలకొల్లుకు దక్కుతుంది. అలాంటివారిని గుర్తుంచుకోవడానికి ఈ ఇనిస్టిట్యూట్ దోహదం చేస్తుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల నేతృత్వంలో నడిచే ఈ ఇన్‌స్టిట్యూట్‌కి హరిరామజోగయ్య చైర్మన్‌ కాగా, రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధంగా ఉందని.. నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలో ముహుర్తం ఖరారు చేస్తామని ఆ ప్రకటన తెలిపింది.

మొత్తం మీద తెలుగు చలనచిత్రరంగంలో పాలకొల్లు ఖ్యాతి మరింతగా పెరుగుతుందని స్థానికులు, సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   41 minutes ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   2 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   3 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   8 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   10 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   10 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   10 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   10 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   10 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle