newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

పార్లమెంటు సీటు.. మాకొద్దు బాబూ!

13-03-201913-03-2019 12:21:25 IST
2019-03-13T06:51:25.943Z13-03-2019 2019-03-13T06:39:49.208Z - - 25-02-2020

పార్లమెంటు సీటు.. మాకొద్దు బాబూ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తలనొప్పి వ్యవహారంలా మారుతోంది. సిట్టింగ్ ఎంపీలు కొందరు పార్టీ మారడం, మరికొందరు పోటీ చేయమని చెప్పడం, కొందరిని పార్టీనే తప్పించాలనుకోవడంతో అభ్యర్థుల కొరత ఏర్పడింది. వైసీపీ బలంగా ఉంటుందనే అంచనాలు ఉన్న చోట్ల పోటీకి బలమైన నేతలు ముందుకురావడం లేదు.

మంత్రులూ మళ్లీ ఎమ్మెల్యేలుగానే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లమని ఒత్తిడి చేస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో క్లిష్టంగా మారుతోంది. సుమారు 8 - 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం పార్టీ వెతుకుతోంది. ఎంపీగా పోటీ చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితేనే ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలోనూ సానుకూల ప్రభావం ఉంటుందనే ఉద్దేశ్యంతో బలమైన అభ్యర్థుల కోసం పార్టీ వెతుకుతోంది.

మంత్రులుగా పనిచేసి జిల్లాల్లో బలమైన నేతలుగా ఉన్న వారిని ఈసారి ఎంపీలుగా పోటీ చేయిస్తే మేలని చంద్రబాబు భావించారు. కానీ, ఇందుకు వారు సానుకూలంగా లేరు. కడప సీటుకు మంత్రి ఆదినారాయణరెడ్డిని అనేక బుజ్జగింపులు, చర్చల తర్వాత బాబు ఒప్పించగలిగారు.

ఒంగోలు పార్లమెంటుకు మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయనని చెప్పడంతో పాటు పార్టీ వీడి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అదే స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలంటే మంత్రి శిద్ధా రాఘవరావును పోటీ చేయాలని బాబు ఆదేశించారు. కానీ, ఆయన మాత్రం తాను దర్శి అసెంబ్లీకే పోటీ చేస్తానని చెబుతున్నారు.

ఇక, గంటా శ్రీనివాసరావును కూడా అనకాపల్లి లేదా విశాఖపట్నం పార్లమెంటుకు పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఆయన మాత్రం మళ్లీ అసెంబ్లీకే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయనను అనకాపల్లి అసెంబ్లీ నుంచే పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక, స్పీకర్ కోడెల శివప్రసాదరావును సైతం నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని బాబు భావించారు. ఆయన మాత్రం మళ్లీ అసెంబ్లీకే పోటీ చేస్తారని బీష్మించుకు కూర్చున్నారు. 

కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం పార్టీని వీడటంతో ఆయన స్థానంలో ఇటీవలే పార్టీలో చేరిన చలమలశెట్టి సునీల్ ను పోటీ చేయించవచ్చు. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారని అనుకున్నా ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్లి అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ స్థానానికి కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా తోట సీతారామలక్ష్మీని పోటీ చేయించాలని బాబు భావిస్తున్నారు. కానీ వారిద్దరూ పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.

అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్‌ను పోటీ చేయిస్తారని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్తగా మాజీ ఎంపీ హర్షకుమార్ తెరపైకి వచ్చారు. రాజమండ్రి స్థానం నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ పోటీకి సిద్ధంగా లేరు. దీంతో వారి కుటుంబం నుంచే ఎవరినైనా పోటీ చేయించాలని భావిస్తున్నారు.

రాజంపేట, తిరుపతి, నెల్లూరు పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థులపై ఏమాత్రం స్పష్టత రావడం లేదు. ఓ వైపు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేసిన చంద్రబాబుకు పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక మాత్రం కష్టంగా మారింది. ఎన్నికల గడువు దగ్గరపడుతున్నా ఇంకా అభ్యర్థులపై ఎటువంటి స్పష్టత రావడం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle