newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

పార్లమెంటులో 'దిశ' ఘటనపై సీరియస్ చర్చ.. వైసీపీ ఎంపీ గాఢనిద్ర

03-12-201903-12-2019 13:01:01 IST
Updated On 03-12-2019 13:03:13 ISTUpdated On 03-12-20192019-12-03T07:31:01.008Z03-12-2019 2019-12-03T07:30:48.948Z - 2019-12-03T07:33:13.532Z - 03-12-2019

పార్లమెంటులో 'దిశ' ఘటనపై సీరియస్ చర్చ.. వైసీపీ ఎంపీ గాఢనిద్ర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత నాలుగు రోజులుగా దేశం మొత్తం అట్టుడికిపోతోంది. కేంద్రం నుండి దేశంలోని అన్ని రాష్ట్రాల వరకు హైదరాబాద్ లో జరిగిన ఘోరంపై తీవ్రంగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. దేశంలోని ప్రతి ప్రభుత్వం దిశ ఘటనపై ఆలోచనలో పడ్డాయి. ఢిల్లీ నిర్భయ ఘటన మరువకముందే మానవ మృగాలు చేసిన ఈ అమానవీయ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, మానవ సంఘాల చర్చలు సాగుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఘటన కావడంతో మన నేతలు మరికాస్త బాధ్యతగా వ్యవహరించాలి. ఆ నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించి.. దిశ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని.. ఇందుకు చట్టాలకు మరింత పదును పెట్టాలని.. శిక్షలను సత్వరమే అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు పార్లమెంట్ సమావేశాలలో చర్చించేందుకు అవకాశం వచ్చింది.

సమావేశాలలో భాగంగా లోక్ సభలో 'జస్టిస్ ఫర్ దిశ'పై తీవ్ర చర్చ జరిగింది. దేశంలోని అన్ని పార్టీలు, ప్రధాన ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రతిపక్షాల పార్టీల ఎంపీలు ఈ అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా కేంద్రప్రభుత్వం సావధానంగా వింటోంది. ఆ చర్చను యావత్ దేశంలోని ప్రజలు టీవీల్లో తిలకిస్తూ కేంద్ర స్పందన కోసం ఎదురుచూశారు.

అయితే ఓ ఎంపీ మాత్రం ఇవేమీ పట్టకుండా మొద్దు నిద్రపోయారు. ఆయనెవరో కాదు.. అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి గోరంట్ల మాధవ్. జస్టిస్ ఫర్ దిశ అంశంపై తీవ్ర చర్చ జరుగుతుండగా ఎంపీ మాధవ్ సుఖంగా నిద్రపోయారు. ఈ దృశ్యం టీవీల ద్వారా దేశం మొత్తం చూడగా సోషల్ మీడియాలో అయితే తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుంది.

Image result for YSRCP MP Madhav deep sleep

వైసీపీ నేతలకు రాష్ట్రంలో అసెంబ్లీ అయినా ఢిల్లీలో పార్లమెంట్ అయినా ఒకటేనని తాపీగా నిద్రపోడానికే వీళ్ళు చట్టసభలకు వెళ్లారంటూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ తమ్మినేని సీతారాంతో సహా కొందరు ఎమ్మెల్యేలు శాసనసభలో నిద్రపోయారు. అప్పుడే అది దుమారం రేపింది. ఇక ఇప్పుడు మరోసారి ఆ పార్టీ నేతలు అభాసుపాలయ్యారు.

అసలు ఘోరకలి దిశ ఘటనపై చర్చ జరుగుతుండగా నిద్ర ఎలా వచ్చింది స్వామీ మీకు అంటూ కొందరు నెటిజన్లు దండాలు పెట్టేస్తున్నారు. మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడం.. వారి రక్షణపై ఏ మాత్రం బాధ్యత లేకపోవడంతోనే ఇంత తీవ్రమైన అంశంపై చర్చలో నిద్ర ముంచుకొచ్చిందని తీవ్ర విమర్శలకు దిగారు. తమ సమస్యలను తీరుస్తారని.. తమకి న్యాయం చేస్తారని కోటి ఆశలతో ఓట్లేసి ఢిల్లీకి పంపించివాళ్ళకి ఆ మాత్రం కోపం రావడంలో తప్పు లేదులెండి! అన్నట్లు గతంలో పోలీస్ అధికారి కూడా అయిన ఈ మాధవ గారు.. అప్పట్లో తొడలు కొట్టి మీసాలు తిప్పి బహిరంగ సవాళ్లు విసిరారండోయ్!

https://www.youtube.com/watch?v=fRwQe-0RQ2c

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle