newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

పార్టీ మార్పుపై ఆకులకు క్లారిటీ వ‌చ్చేసిందా..?

24-09-201924-09-2019 09:56:27 IST
Updated On 24-09-2019 10:15:58 ISTUpdated On 24-09-20192019-09-24T04:26:27.263Z24-09-2019 2019-09-24T04:26:25.730Z - 2019-09-24T04:45:58.257Z - 24-09-2019

పార్టీ మార్పుపై ఆకులకు క్లారిటీ వ‌చ్చేసిందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయ‌నొక క‌రుడుగ‌ట్టిన బీజేపీ నేత‌. ఇటీవలి ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయ లెక్క‌లు వేసిన ఆయ‌న క‌మ‌లాన్ని వీడారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అన్న చందాన ఆయ‌న త‌ల‌చింది ఒక‌టైతే.. ప్ర‌జ‌లు చేసింది మ‌రొక‌టి.దాంతో ఎన్నిక‌ల్లో ఓట‌మిని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న ప‌క్క చూపులు చూస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న తిరిగి క‌మ‌లం గూటికి వెళ‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న‌పై ఇప్పుడు ఒక కొత్త వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది

కాగా, ఆకుల స‌త్య నారాయ‌ణ, మాజీ ఎమ్మెల్యే. 2014లో రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీని వీడి జ‌న‌సేన పార్టీలో చేరారు. రాజ‌మండ్రి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌రువాత నుంచి పొలిటిక‌ల్‌గా సైలెంట్‌గా ఉన్నారు.ఎన్నిక‌ల త‌రువాత ఆయ‌న పార్టీ మారుతార‌ని ప్ర‌చారం మొద‌లైంది.

జ‌న‌సేన‌ను వీడి తిరిగి బీజేపీలో చేరుతార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే అంద‌రూ భావించిన‌ట్టు ఆయ‌న బీజేపీలో చేర‌లేదు. అక్క‌డ్నుంచి కూడా ఆహ్వానం అంద‌లేదు.దీంతో ఆకుల స‌త్య‌నారాయ‌ణ తిరిగి పున‌రాలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. జ‌న‌సేన‌ను వీడి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుంద‌ని స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆరా తీస్తున్నార‌ని స‌మాచారం.

ఆకుల స‌త్య‌నారాయ‌ణ చూపులు ఇప్పుడు అధికార‌పార్టీవైపు ప‌డ్డ‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీలో చేరేందుకు ఆయ‌న తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. రాబోయే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజంమండ్రిలో ప‌ట్టు ఉన్న ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌ను పార్టీలో చేర్చుకునేందుకు అధికార పార్టీ నుంచి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది.

మ‌రోవైపు జిల్లాల విభ‌జ‌న‌తో రాజ‌మండ్రి జిల్లాగా మార‌నుంది. దీంతో మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆకుల స‌త్య‌నారాయ‌ణ పార్టీ మారే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

మొత్తానికి ఆకుల స‌త్య‌నారాయ‌ణ త్వ‌ర‌లోనే పార్టీ మారుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ద‌స‌రా త‌రువాత పార్టీ మారేందుకు ముహూర్తం పెట్టుకున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి ఆకుల స‌త్య‌నారాయ‌ణ పార్టీ మార‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle