newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

పాత మిత్రులు ఒక్క‌ట‌వుతారా..?

31-08-201931-08-2019 07:39:53 IST
2019-08-31T02:09:53.681Z31-08-2019 2019-08-31T02:09:48.441Z - - 24-02-2020

పాత మిత్రులు ఒక్క‌ట‌వుతారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో, ప్ర‌జ‌ల్లో ఇప్పుడు రాజ‌ధాని అంశం ఎంత‌లా గంద‌ర‌గోళం సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌భుత్వం నుంచి ఈ వ్య‌వ‌హారంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం, రాజ‌ధాని మారుస్తార‌ని ఊహాగానాలు వ‌స్తుండ‌టం, పార్టీల‌న్నీ రాజ‌ధాని మార్చొద్ద‌ని ప్ర‌భుత్వంపై పోరాటానికి సిద్ధం కావ‌డంతో ఏపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. ప్ర‌భుత్వం కూడా ఈ వ్య‌వ‌హారాన్ని తేల్చ‌కుండా చ‌ర్చ జ‌ర‌గాల‌ని చూస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్య‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. సీనియ‌ర్ నేత‌, మంత్రి అయిన బొత్స.. రాజ‌ధానిపై ఇప్ప‌టికి ఐదుసార్లు మీడియాతో మాట్లాడినా క్లారిటీ ఇవ్వ‌కుండా నాన్చుతున్నారంటే ఈ విష‌యంలో చ‌ర్చ జ‌ర‌గాల‌నే ప్ర‌భుత్వం చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. రాజ‌ధాని మారుస్తామ‌ని ఎవ‌రు చెప్పారు అని ప్ర‌శ్నిస్తూనే.. రాజ‌ధానిగా ఈ ప్రాంతం స‌రైన‌ది కాదు అని ఆయన ప‌దేప‌దే చెబుతున్నారు.

రాజ‌ధాని మార్పు వ్య‌వ‌హారంపై అన్ని పార్టీలూ యుద్ధానికి దిగాయి. అయితే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ఒంట‌రిగా పోరాడ‌టం కంటే ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని ముందుకుపోతే మేల‌ని భావిస్తోంది. అమరావ‌తిలో రాజ‌ధాని కొన‌సాగ‌డం తెలుగుదేశం పార్టీకి క‌చ్చితంగా అవ‌స‌రం.

అన్ని పార్టీల కంటే టీడీపీకే ఈ అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంది. ఒంట‌రిగి పోరాడితే ప్ర‌భుత్వం దిగివ‌చ్చే ప‌రిస్థితి లేదు. పైగా టీడీపీ అక్ర‌మాలు చేసింద‌ని ఏవేవో లెక్క‌లు చెబుతుంది. ఇదంతా కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

దీంతో అన్ని పార్టీల‌ను క‌లుపుకొని పోయి ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి సీనియ‌ర్ నేత‌ల‌ను సైతం ఆయ‌న పుర‌మాయించారు. అయితే, ఎవ‌రితో వారు చ‌ర్చ‌లు జ‌రుపుతారు ? ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీతో ఎవ‌రు క‌లిసి వ‌స్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మొన్న‌టి వ‌ర‌కు టీడీపీపై ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ ఒక్క‌సారిగా టీడీపీతో క‌లిసి పోరాడేందుకు మొగ్గు చూప‌క‌పోవ‌చ్చు.

ఇక‌, జ‌న‌సేన‌కు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి ఎదుర‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఆ పార్టీకి టీడీపీతో లోపాయికారి ఒప్పందం ఉంద‌నే ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం. ఇప్ప‌టికే ఈ విష‌యంలో దెబ్బతిన్న ప‌వన్ క‌ళ్యాణ్‌.. మ‌ళ్లీ టీడీపీతో క‌లిసి పోరాడే ఛాన్సులూ త‌క్కువే. ఇక‌, చంద్ర‌బాబుకు మిగిలి ఉంది క‌మ్యూనిస్టులు. వారు కూడా రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నారు. అయితే, వారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి అడుగులు వేస్తున్నారు.

పైగా రాజ‌ధానిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ వ్య‌వ‌హారాన్ని వైసీపీ తెర‌మీద‌కు తెస్తుండ‌టంతో టీడీపీతో ఏ పార్టీ క‌లిసి పోరాడినా ఆ పార్టీ టీడీపీ అక్ర‌మాల‌కు మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే ప్ర‌చారం వైసీపీ గ్రూపు నుంచి మొద‌లయ్యే అవ‌కాశం ఉంది. మొత్తానికి అన్ని పార్టీల‌కు పెద్ద‌న్న‌గా మారి ప్ర‌భుత్వంపై యుద్ధానికి వెళ్లాల‌నుకుంటున్న చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle