newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

పాతికేళ్లుగా రూ. 400 జీతం.. ఇప్పుడు 4,000కు పెంపు

03-12-201903-12-2019 08:52:40 IST
2019-12-03T03:22:40.675Z03-12-2019 2019-12-03T03:13:37.826Z - - 15-08-2020

 పాతికేళ్లుగా రూ. 400 జీతం.. ఇప్పుడు 4,000కు పెంపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెలకు కేవలం 400 రూపాయల జీతంతో గత పాతికేళ్లుగా పనిచేస్తూ గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న మహిళలను ఏపీ ప్రభుత్వం కాస్త కరుణించింది. ఇంతవరకు నాలుగు వందల వేతనానికి పనిచేస్తున్న గిరిజిన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనం నాలుగు వేల రూపాయలకు పెంచుతూ గత నెల చివరో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో నెలకు కేవలం 400 రూపాయలతో ఎవరూ పని చేయరు. కానీ వారు చేశారు. అది కూడా ఒకటి రెండు నెలలో, సంవత్సరాలో కాదు, ఏకంగా పాతికేళ్లుగా చేస్తూనే ఉన్నారు.

ఎంతమందికి చెప్పుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇక మా బతుకులింతే అని వారు ఆవేదన చెందుతున్న తరుణంలోనే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వారి దీనస్థితిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో వారి పాతికేళ్ల కష్టానికి తెరపడింది. 

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో ఆశ వర్కర్ల వేతనాలను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తరుణంలో గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల పరిస్థితిని పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రికి వివరించారు.

వారి వేతనాలను కూడా పెంచాలంటూ సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించడంతో అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతనాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 

నవంబర్‌ 27న జరిగిన కేబినెట్‌ సమావేశంలో వీరి వేతనాలను రూ.400ల నుంచి రూ.4000లకు పెంచారు. డిసెంబర్‌ నుంచే పెరిగిన వేతనాలు అందనున్నాయి.

ఇంతవరకూ ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని, తమ సేవలను వినియోగించుకోవడమే మినహా ఏ ప్రభుత్వమూ తమను ఆదుకోలేదని అయితే ప్రస్తుత ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తమ వేతనాన్ని పది రెట్లు పెంచడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆశా వర్కర్ల తరహాలోనే గిరిజన ఆవాసాల్లో ఉండే గిరిజనుల ఆరోగ్య స్థితిగతులను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆరోగ్య పథకాలను అమలు చేయడం, ప్రత్యేకించి పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన సర్వేలు చేయడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రతలపై అవగాహన కలిగించడం లాంటి పనులన్నింటినీ వారు చేస్తున్నారు.

వారి ఎంపికలో విద్యార్హతలు, స్థానికతలకు సంబంధించిన రెండు తేడాలు మినహా, ఆశ వర్కర్లు చేసే పనులే వీరూ చేస్తున్నారు. అయితే కొండ కోనల్లో పని చేసే గిరిజనులు కావడం, వారి సమస్యలపై అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో సుమారు రెండున్నర దశాబ్దాలుగా వారి బతుకులు మెరుగుపడలేదు.

1995లో వారిని ఆరోగ్య కార్యకర్తలుగా నియమించినప్పుడు రూ.300లు గౌరవ వేతనం ఇచ్చేవారు. తరువాత కేవలం వంద మాత్రమే పెంచారు. నెలకు రూ.400లతో బతకడం అసాధ్యం. కనిపించిన ప్రతి నాయకుడికీ తమ కష్టాన్ని చెప్పుకున్నా... వారి బతుకులు మారలేదు.

రాష్ట్రం మొత్తం మీద 7 ఐటీడీఏల పరిధిలో 2651 మంది గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు పని చేస్తుండగా వీరిలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 498 మంది, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1184 మంది, పాడేరు ఐటీడీఏ పరిధిలో 752 మంది, చింతూరు ఐటీడీఏ పరిధిలో 40 మంది, కేఆర్‌ పురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 163 మంది పని చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఆశవర్కర్లకు సంబంధించిన వేతనాలను రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. అదే సమయంలో గిరిజన ఐటీడీఏ ప్రాంతాల్లో ఆశ వర్కర్ల తరహాలోనే పని చేస్తున్న వీరి వేతనాలు మాత్రం పెంచలేదు. దీనిపై వారు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పాముల పుష్ప శ్రీవాణి ఒక గిరిజనబిడ్డగా గతంలో కూడా గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల వేతన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు.

ఆమె ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యురాలు కావడంతో అప్పటి ప్రభుత్వం ఈమె విన్నపాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే వై,ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రి కావడం వారికి కలిసొచ్చింది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle