newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

పాజిటివ్ మోడ్‌లో వెళుతున్న జ‌గ‌న్..!

30-05-201930-05-2019 08:06:33 IST
2019-05-30T02:36:33.195Z30-05-2019 2019-05-30T02:36:26.882Z - - 26-06-2019

పాజిటివ్ మోడ్‌లో వెళుతున్న జ‌గ‌న్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకుంటున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాజిటీవ్ మోడ్ లో క‌నిపిస్తున్నారు. ఆయ‌న‌పై గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు ఉండేవి. ఆయ‌నకు అహంబావి అని, పెద్ద‌ల‌ను గౌర‌వించ‌ర‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు జ‌గ‌న్ పై ఒక ముద్ర వేశాయి. అయితే, జ‌గ‌న్ వైఖ‌రి చూస్తుంటే ఆయ‌న పూర్తిగా పాజిటీవ్ మోడ్ లో వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు స‌హా త‌న‌కు ఎవ‌రిపైనా వ్య‌క్తిగ‌త కోపం లేద‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా క్ష‌మించేశాన‌న్నారు. ఇప్పుడు ఆయ‌న వైఖ‌రి అలానే క‌నిపిస్తోంది. రాజ‌కీయ విభేదాలను ప‌క్క‌న‌బెట్టి మ‌రీ వివిధ పార్టీల నేత‌ల‌ను ఆయ‌న త‌న ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానించారు.

ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిసిన జ‌గ‌న్ ఆయ‌న‌ను కూడా ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానించినా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం కూడా ఉండ‌టంతో హాజ‌రుకావ‌డం లేదు. ఇక‌, న‌రేంద్ర మోడీతోనూ జ‌గ‌న్ సానుకూల ధోర‌ణితో వెళ్లాల‌ని, స‌త్సంబంధాలతోనే రాష్ట్రానికి రావాల్సిన‌వి సాధించుకోవాల‌ని భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తోనూ ఆయ‌న స‌త్సంబంధాల‌నే కోరుకుంటున్నారు. 

ఎన్నిక‌ల ముందు చేసుకున్న విమ‌ర్శ‌లను ప‌ట్టించుకోకుండా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి అంద‌రు నేత‌ల‌కూ ఆహ్వానాలు పంపుతున్నారు. ముఖ్యంగా మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుతో ఢీ అంటే ఢీ అనేలా సాగిన జ‌గ‌న్ ఇప్పుడు నేరుగా ఫోన్ చేసి ప్ర‌మాణ‌స్వీకారానికి రావాల‌ని ఆహ్వానించారు. అయితే, చంద్ర‌బాబు వెళ్ల‌కుండా పార్టీ త‌ర‌పున ప్ర‌తినిధుల‌ను పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఒకానొక స‌మ‌యంలో చేసుకున్న వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టి ఇప్పుడు జ‌గ‌న్ స్వ‌యంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానించారు. ఆయ‌న‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేత‌ల‌కు జ‌గ‌న్ ఫోన్లు చేసి మ‌రీ ఆహ్వానించారు.

ఇక‌, ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్ ను సైతం జ‌గ‌న్ ఆహ్వానించారు. ప‌క్క రాష్ట్రంలో కీల‌క నేత కావ‌డంతో ఆయ‌న‌తోనూ మంచి సంబంధాలు ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇక‌, మాజీ కేంద్ర‌మంత్రి చిరంజీవి, రాజ్య‌స‌భ స‌భ్యులు కేవీపీ రామ‌చంద్ర‌రావు కాంగ్రెస్ లో ఉన్నా వారితో ఉన్న వ్య‌క్తిగ‌త సంబంధాల‌తో వారిద్ద‌రికీ జ‌గ‌న్ ఫోన్ చేశారు. మొత్తంగా జ‌గ‌న్.. సానుకూల దృక్ఫ‌ధంతో ముందుకుపోవాల‌ని భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle