newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

పవ‌న్ ఫోక‌స్ అంతా అక్కడే..!

14-03-201914-03-2019 22:15:44 IST
Updated On 14-03-2019 16:14:17 ISTUpdated On 14-03-20192019-03-14T16:45:44.168Z14-03-2019 2019-03-14T09:26:42.546Z - 2019-03-14T10:44:17.555Z - 14-03-2019

పవ‌న్ ఫోక‌స్ అంతా అక్కడే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్‌లో తామే ప్రత్యామ్నాయం అంటూ ముందుకొస్తున్న జ‌న‌సేన పార్టీ అభ్యర్థుల ప్రక‌ట‌న‌లో ముందుంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ప్రక‌ట‌న కాక‌ముందే 32 అసెంబ్లీ, 4 పార్ల‌మెంటు స్థానాల‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. ఇవాళ జ‌న‌సేన ఐదో ఆవిర్భావ దినోత్సవాన్ని రాజ‌మండ్రి వేదిక‌గా నిర్వహించ‌నున్నారు. ఈ స‌భ ద్వారానే ఎన్నిక‌ల ప్రచార శంఖారావాన్ని పూరించ‌నున్నారు. పాతికేళ్ల రాజ‌కీయం చేయ‌డానికి తాను వ‌చ్చాన‌ని, త‌న‌కు వెంట‌నే ముఖ్యమంత్రి అయిపోవాల‌ని లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. 

మ‌రికొన్నిసార్లు మాత్రం 2019 ఎన్నిక‌ల్లోనే స‌త్తా చాటుతామ‌ని, అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అయినా అధికారం కోసం పోటీ ప‌డితేనే ఓట‌రు ఆ పార్టీ వైపు చూస్తారు. అధికారం కోసం పోటీ ప‌డ‌ని పార్టీని ఓట‌రు కూడా ప‌క్కన పెడ‌తారు. ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌న‌సేన తాము అధికారంలోకి వ‌స్తామ‌ని, తామే ప్రత్యామ్నాయం అని చెబుతోంది.

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే అన్ని జిల్లాలపై దృష్టి పెట్టాలి. కాక‌పోతే వివిధ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో కొన్ని పార్టీల‌కూ ఎక్కువ బ‌లం ఉండ‌వ‌చ్చు. కొన్ని జిల్లాల్లో త‌క్కువ బ‌లంగా ఉండ‌వ‌చ్చు. కానీ అధికారాన్ని చేప‌ట్టాల‌నుకుంటున్న పార్టీలు అన్ని జిల్లాల‌పై ఫోక‌స్ చేయాల్సిందే. జ‌న‌సేనలో మాత్రం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. త‌న‌కు ప‌ట్టున్న జిల్లాల‌పైనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, ఉత్తరాంధ్రపైనే ఆయ‌న ఎక్కువ ఫోక‌స్ చేశారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపు సామాజ‌క‌వ‌ర్గం ఎక్కువ కావ‌డంతో ఆయ‌నకు ఈ జిల్లాలో మంచి క్యాడ‌ర్ త‌యారైంది. ఇక‌, ఉభ‌య‌గోదావ‌రి త‌ర్వాత ప‌వ‌న్ ఉత్తరాంధ్రపై ముందునుంచే ఎక్కువ దృష్టి పెట్టారు.

అభివృద్ధిలో ఉత్తరాంధ్ర వెనుక‌బాటు, ఉద్దానం కిడ్నీ స‌మ‌స్యపై పోరాటం చేస్తాన‌ని ప్రక‌టించారు. కిడ్నీ స‌మ‌స్యను ప‌రిష్కరించ‌డానికి త‌న‌వంతు ప్రయ‌త్నం చేశారు. ప్రజా పోరాట యాత్ర, క‌వాతు పేర్లతో ఈ జిల్లాల్లో ఆయ‌న ఎక్కువ రోజులు ప‌ర్యటించారు. దీంతో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ జ‌న‌సేన‌కు కొంత బ‌లం ఉంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉభ‌య గోదావ‌రి, ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు ద‌క్కించుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నట్లు క‌నిపిస్తోంది.

నిన్న విడుద‌ల చేసిన జ‌న‌సేన మొద‌టి విడ‌త అభ్యర్థుల జాబితాలోనూ ఈ జిల్లాల‌కే ప‌వ‌న్ పెద్దపీట వేశారు. మొత్తం 32 అసెంబ్లీ స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రక‌టించ‌గా అందులో 19 మంది అభ్యర్థులను ఈ ఐదు జిల్లాల నుంచే ప్రకటించారు. నాలుగు పార్లమెంటు స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రకటించ‌గా నాలుగూ ఈ జిల్లాల నుంచే ఆయ‌న ప్రక‌టించారు.

ఇక‌, ఆవిర్భావ స‌భ పెద్ద ఎత్తున నిర్వహించ‌డానికి కూడా ప‌వ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రినే ఎంచుకున్నారు. ఇక్కడే ఆయ‌న గ‌తంలో క‌వాతు పేరుతో భారీ బ‌ల‌ప్రద‌ర్శన చేశారు. మ‌రోసారి రాజ‌మండ్రిలోనే స‌భ నిర్వహించాల‌నుకోవ‌డం ద్వారా ఈ ప్రాంతంపైనే త‌న దృష్టి అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పక‌నే చెబుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle