newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

పవన్- వీహెచ్ భిన్న ధృ‌వాలు కలిశాయ్.. !

10-09-201910-09-2019 08:00:25 IST
Updated On 10-09-2019 15:45:17 ISTUpdated On 10-09-20192019-09-10T02:30:25.436Z10-09-2019 2019-09-10T02:29:55.980Z - 2019-09-10T10:15:17.412Z - 10-09-2019

పవన్- వీహెచ్ భిన్న ధృ‌వాలు కలిశాయ్.. !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యురేనియం వారిద్దరినీ కలిపింది. రాజకీయంగా ఇద్దరు వ్యక్తులు భిన్న ధృ‌వాలుగా ఉన్నా వారిద్దరూ ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలోనూ పవన్ ఈ పోరాటం కొనసాగించనున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు.. పవన్ మద్దతు కోరడం చర్చనీయాంశం అయింది. 

జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో వీరిద్దరూ మాట్లాడారు. నల్లమల పరిరక్షణలో భాగంగా అఖిలపక్ష భేటీ రెండు మూడు రోజుల్లో ఉంటుందని తెలుస్తోంది. నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దని స్పష్టం చేశారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించారు.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు పవన్. జీవవైవిధ్యం నాశనమవడమే గాక, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాలతో కృ‌ష్ణా, గోదావరి జలాలు కలుషితం అవుతాయన్నారు వీహెచ్-పవన్. 

యురేనియం తవ్వకాలతో అడవుల్లోని వన్యప్రాణులు అకారణంగా మరణిస్తాయని, దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని వీహెచ్ చెప్పారు. పవన్ తో కలవడం సంతోషంగా ఉందన్నారు వీహెచ్.

యురేనియం తవ్వకాలు రాష్ట్రంలో జరగాలనే నిర్ణయం కూడా మంచిది కాదని ఇది గిరిజనులకు మాత్రమే సంబందించిన విషయం కాదని టీపీసీసీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది జీవ వైవిద్యం, మానవాళి మొత్తానికి సంబందించిన విషయం అని అందుకనే దీని పైన కూడా మాజీ రాజ్యసభ ఎంపీ వీ. హనుమంతరావు ఆధ్వర్యంలో మరొక కమిటి పనిచేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా తెలిపారు. దీనిపై త్వరలో నివేదిక సమర్పించనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle