newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

పవన్ వదులుకునే సీట్ అదేనా?

20-03-201920-03-2019 08:56:24 IST
2019-03-20T03:26:24.243Z20-03-2019 2019-03-20T03:23:41.470Z - - 26-06-2019

పవన్ వదులుకునే సీట్ అదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్, మరో నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చోట్ల ఆయన గెలుపు ఖాయమని జనసేన కార్యకర్తలు నమ్మకంగా చెబుతున్నారు. ఎందుకంటే భీమవరంలో కాపుల ఓటింగ్  ఎక్కువగా ఉంది. ఆ తర్వాత బీసీలు, క్షత్రియుల ఓటింగ్ కూడా ప్రధానమే. అందుకే 2009 ఎన్నికల్లో పీఆర్పీ భీమవరంలో రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో చిరంజీవి వ్యూహాత్మకంగా రాజు కులానికి చెందిన వ్యక్తిని బరిలో దింపారు.

రాజులతో పాటు కాపులు కూడా ఓట్లేస్తే పీఆర్పీ గెలవడం ఖాయమని భావించారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హవా ముందు అప్పట్లో కుల సమీకరణం పనిచేయలేదు. కానీ ఈసారి అలాకాదట. కాపులతో పాటు ఇతర కులాలు కూడా పవన్ కల్యాణ్ వైపే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే భీమవరంలో ఆయన విజయం నల్లేరు మీద నడకలాంటిదని జనసేన నేతలు అభిప్రాయ పడుతున్నారు.

ఇక విశాఖ జిల్లా గాజువాక విషయానికొస్తే, ఇక్కడ కూడా కాపుల ఓట్లు కీలకం. ఆ తర్వాత యాదవులు ఉన్నారు. అందుకే 2009 ఎన్నికల్లో గాజువాక సీటును పీఆర్పీ సునాయాసంగా గెల్చుకుంది. 2014లో గంటా ప్లానింగుతో కాపులు ఓట్లు తమవైపు తిప్పుకున్న టీడీపీ  అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ పోటీలో ఉండటంతో గాజువాకలో ఆయనకు తిరుగు ఉండదని అర్థం అవుతోంది. అయితే రెండు సీట్లలో గెలిచిన తర్వాత కచ్చితంగా ఏదో ఒక సీటు వదులు కోవాలి పవన్ కల్యాణ్.

ఇప్పుడు దీని మీద కూడా ఆయన క్లారిటీగా ఉన్నారట. రెండు స్థానాల్లో గెలిచిన తర్వాత, గాజువాకను పవన్ కల్యాణ్ వదులు కుంటారని సమాచారం. ఎందుకంటే కాపు సామాజికవర్గ ఓటింగుతో ఆ ఉప ఎన్నికలో కూడా జనసేన గెలవడం ఖాయమని పవన్ నమ్ముతున్నారట. అందుకే గాజువాక, భీమవరంలో గెలిచి ఉప ఎన్నిక సమయంలో గాజువాకను వదులు కోడానికి పవన్ డిసైడ్ అయినట్లు జనసేన నేతలు చెబుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle