newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

పవన్ ప్రయాణం సాఫీయేనా?

04-01-201904-01-2019 10:58:46 IST
Updated On 04-01-2019 11:48:56 ISTUpdated On 04-01-20192019-01-04T05:28:46.919Z04-01-2019 2019-01-04T05:28:44.698Z - 2019-01-04T06:18:56.077Z - 04-01-2019

పవన్ ప్రయాణం సాఫీయేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు దాటిపోయాయి. వాళ్ళ అన్నయ్య పెట్టిన పార్టీ నాటినుంచి లెక్కలేస్తే పదేళ్లు పూర్తవుతాయి. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పోటీలోకి దిగుతున్నానంటూ ప్రకటించి సంవత్సరం గడిచిపోయింది. ఆయన రాజకీయ ప్రయాణం పైన ఇప్పటికే చాలామంది సమీక్షలు రాశారు. మొదట్లో పేపర్లు, టీవీల నిండా పవన్ కళ్యాణ్ వార్తలే కనిపించేవి. రానురాను ఆయన వార్తలు లోపలి పేజీల్లోకి.. ఆ తరువాత సింగల్ కాలమ్స్‌కి పరిమితమైపోయాయి. కానీ అతను మాత్రం నీరసించకుండా తన ప్రస్థానాన్ని కొనసాగించడం సంతోషమే! అయితే మొదట్లో ఉన్న అతని అభిమానుల సందడి మాత్రం కొద్దిగా తగ్గింది.

దాదాపు ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ‘రాజకీయం కం స్టడీ టూర్’ బేసిగ్గా గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఉత్తరాంధ్రలో ఒక స్థాయిలో స్పీడు పెంచినా... అది ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఆగిపోయినట్లు కనిపిస్తుంది. అంతకుముందు ఆయన శ్రీకాకుళం కిడ్నీ బాధితులతోపాటు అరకు తదితర గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన సంఘటనలు కొన్ని వ్యక్తిగతంగా ఆయనకు మేలు చేకూర్చాయి తప్ప పార్టీ పరంగా ఏ మేరకు ఉపయోగపడ్డాయో తెలియదు. ఇక ఆయన మేధావులతో కూర్చుని నిర్వహించిన ఏపీ ఆర్థిక పరిస్థితిపై చేసిన స్టడీ ఏమైందో తెలియదు. మోదీ ప్రభుత్వం ఆంధ్రాకు ఇంకా 75 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని తేల్చారు. అక్కడితో ఆ రీసెర్చ్ కథ ముగిసినట్లే!

ఇప్పుడు పవన్ తన ఎన్నికల ఢంఖా భజాయించానని ప్రకటించారు. అంటే మిగతా జిల్లాల్లో అతను పర్యటించబోతున్నట్లు మనం అర్ధం చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని, ఎవరితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించిన పవన్... ఇప్పుడు కమ్యూనిస్టులతో తప్ప ఇంకెవరితోనూ పొత్తులుండవని విస్పష్టంగా చెప్పేశారు. ఆమధ్య తనకు తెలంగాణా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పుడేం చెప్తారో చూడాలి. అదలా ఉంచితే... తన  ప్రతి ప్రకటనలోనూ, పబ్లిక్ మీటింగుల్లోనూ పవన్ తాను గత ఎన్నికల్లో టీడీపీతో ఎందుకు సావాసం చేయాల్సి వచ్చిందో విధిగా చెప్తారు. ఎందుకు దూరం జరగాల్సి వచ్చిందో కూడా వివరించడానికి ప్రయత్నిస్తారు. ఈసారి మాత్రం తనను తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు ఎలా వాడుకుని వదిలేశారన్న మాటల్ని చెప్పారు.

చంద్రబాబు గురించి దూరం జరిగిన వాళ్లంతా   చెప్పే మాటే ఇది. ఈసారి పవన్ నోటా ఇదే మాట వినిపించడం కొంచెం డిఫరెంట్. ఆయన తన పార్టీని కమ్యూనిస్టులతో జత కట్టించే ఆలోచన చేయడం వలన ఒనగూడే ప్రయోజనాల మాట అటుంచి, అసలు తనకున్న బలాబలాల్ని పవన్ బేరీజు వేసుకుంటున్న దాఖలాలు కనిపించవు. జిల్లాలవారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న మాటైతే నిజమే కావచ్చు. అయితే ఆయా జిల్లాల్లో బలమైన నాయకులెవరూ జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లు కనిపించదు. రాజకీయాల్లో తన పార్టీ శైలి, దృక్పధం వేరుగా ఉంటుందని పదేపదే చెప్తున్న పవన్ కళ్యాణ్... ఇక ఇప్పుడు ఎవర్ని చేరదీస్తారో, ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తారో చూడాలి. అక్కడక్కడా కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు జనసేన పంచన చేరినా... చెప్పుకోదగిన వాళ్ళెవరూ కనిపించరు.

ఈ మధ్య నాదెండ్ల మనోహర్‌కు కండువా కప్పి పక్కన కూర్చోపెట్టుకుంటున్నా, ఎక్కడా ఆయన స్వరం వినిపిస్తున్నట్లు కనిపించదు. ఇప్పటికే తన వార్తల్ని  ప్రసారం చేయడం మానేసిన ఎలక్ట్రానిక్ మీడియా, కొన్ని పత్రికల వ్యవహారశైలిని గమనించిన పీకే... తనకంటూ సొంత మాధ్యమాల్ని మిత్రుల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చెంత చేరబోతున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు నిన్న మొన్నటిదాకా సొంత చానెళ్లు ఉండేవి. ఇప్పుడవి పవన్ అనుకూల బృందానికి చేరినట్లు సమాచారం. అయితే వాటి ప్రభావం ఎంత ఉన్నదన్న బేరీజులు ఆయన పార్టీ వాళ్ళే వేసుకోగలగాలి. కేవలం ప్రసార మాధ్యమాలతోనే ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితులు లేనప్పటికీ తన కార్యకర్తలకు, అభిమానులకు తన వాణిని చేరవేయగలిగితేనే ఎంతో కొంత ప్రయోజనాలు ఉంటాయన్నది వాస్తవం. 

ఇటీవల చంద్రబాబు జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘తన పార్టీ పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే మీకేంటంటూ’ ప్రశ్నించడంతో జనసేన మళ్ళీ కొంత వార్తల్లో నలిగింది. అసలు తనకా ఉద్దేశం లేదంటూ పీకే తిప్పికొట్టారు. కానీ అయన స్వరంలో ఉండాల్సినంత తీవ్రత లేదంటూ అభిమానులు నిరాశ చెందారన్నది సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.  ఇంతకీ పవన్ డోలాయమాన స్థితిలో ఉన్నారా... ఇంకా తెలుగుదేశం పార్టీతో దోస్తీ కట్టాలని అనుకుంటున్నారా? అంటే ఈ ప్రశ్నలకు కచ్చితంగా నో అని సమాధానం చెప్పుకున్నా... అసలీ ప్రకటన చేయాల్సి వచ్చే పరిస్థితిని కల్పించిన చంద్రబాబు రాజకీయ చతురతను పసిగట్టాల్సిందే! జనాల్లో కొంత కన్ఫ్యూషన్ తెచ్చి అవతలి వ్యక్తిని బలహీనపరిచే సూత్రమది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రెండు ప్రధాన ప్రత్యర్థుల మధ్య నిలబడ్డారు. ఇక నడవడమే తరువాయి. ఆయన రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో.. ఆయన భవిష్యత్తు ఎలా వుండబోతుందో ఈ ఎన్నికలే తేల్చేస్తాయి. సందేహమే లేదు!

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle