newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

పవన్ టార్గెట్.. అంబటి కీలక వ్యాఖ్యలు

17-09-201917-09-2019 08:10:15 IST
2019-09-17T02:40:15.016Z17-09-2019 2019-09-17T02:31:59.118Z - - 15-10-2019

పవన్ టార్గెట్.. అంబటి కీలక వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జగన్ వందరోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

’’పవన్‌ కల్యాణ్‌ లావాదేవీలను బయటకు తీస్తాం. లింగమనేని రమేష్ వద్ద పవన్‌ కల్యాణ్‌ ఎకరం రూ.25 లక్షలు పెట్టి కొన్నారా? అది బ్లాక్ మనీతో కొన్నారా? చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ఒప్పందం వల్ల లింగమనేని ఇచ్చారా? ఈ విషయాలన్నీ బయటకు తీసుకొని వస్తాం’’అన్నారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. జగన్ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ ఇచ్చిన నివేదిక పట్ల అంబటి రాంబాబు తీవ్రంగా  స్పందించారు.

జనసేన నివేదిక చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి కూర్చొని రాసినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు ముందు బెంచీలో కూర్చొని రాస్తుంటే.. వెనుక బెంచీలో కూర్చున్న పవన్ కళ్యాణ్ కాపీ కొట్టారనిపిస్తోందని విమర్శించారు. వైసీపీ మరో 100 ఏళ్లు పరిపాలన చేసినా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ తమకు మంచి సర్టిఫికెట్‌ ఇవ్వరని అంబటి రాంబాబు తెలిపారు.

తమకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ప్రజల సరిఫ్టికెట్ మాత్రమే తమకు శిరోధార్యం అన్నారు. ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల మృతిపై అంబటి స్పందించారు.  ఆయన మరణంపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి... వీటిపై తెలంగాణ సర్కార్ నిష్సక్షపాత విచారణ జరిపించాలన్నారు. కోడెల మృతిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు. పోలీసుల విచారణలో వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   7 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   12 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   15 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   15 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   16 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   16 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle