newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

పవన్ జనసేన పయనమెటు? యురేనియం ఆందోళన కలిసొస్తుందా?

14-09-201914-09-2019 11:04:13 IST
Updated On 14-09-2019 10:58:30 ISTUpdated On 14-09-20192019-09-14T05:34:13.056Z14-09-2019 2019-09-14T05:27:47.387Z - 2019-09-14T05:28:30.850Z - 14-09-2019

పవన్ జనసేన పయనమెటు? యురేనియం ఆందోళన కలిసొస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన సార్వత్రిక ఎన్నికల తరువాత ఆ పార్టీ కార్యకలాపాలన్నీ పార్ట్ టైమ్ రాజకీయాలను తలపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా జనసేన హడావుడంతా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చుట్టూనే తిరిగింది.

జనంలో పవన్ పట్ల ఉన్న అభిమానం, సమస్యలపై ఆయన స్పందించే తీరు పట్ల సానుకూలత వ్యక్తమౌనా...ఆ అభిమానం, ఆ సానుకూలత ఓట్ల రూపంలో కనిపించకపోవడానికి కారణం...జనసేనలో రాజకీయ నేపథ్యం ఉన్న నేతగానీ, పవన్ వినా ప్రజాసమస్యలపై గళమెత్తగల నాయకుడు కానీ లేకపోవడం. 

దీంతో పవన్ కల్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే జనసేన జెండాలు కనిపించేవి. అంటే పవన్ ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడే జనసేన సందడి కనిపించేది. అది ఆయన అక్కడ ఉన్న రోజు మాత్రమే జనసేన హడావుడి ఉండేది.

అందుకే జనసేన అంటే  ఒక పార్టీగా జనం భావించలేదు. జనసేన అంటే పవన్ కల్యాణ్ మాత్రమే అని భావించారు. అందుకే పార్టీగా జనసేనకు ఓట్లు రాలేదు. సార్వత్రిక ఎన్నికల తరువాత జనసేన విలీనంపై పలు వార్తలు వచ్చినా ఆ పార్టీ అధినేత వాటన్నిటికీ ఖండించారు. 

అంతే కాకుండా గెలుపు ఓటములకు అతీతంగా పార్టీని సిద్ధాంత ప్రాతిపదికన నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా కొనసాగిస్తానని ఉద్ఘాటించారు. జనబాహుల్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ పై జనంలో విశ్వసనీయతను పెంచిన అంశమిది.

అయితే రాజకీయ పార్టీగా ఎప్పడూ క్రియాశీలంగా ఉండటం, ప్రజాక్షేత్రంలో సమస్యలపై గళమెత్తడం అన్న విషయంలో మాత్రం జనసేన వెనుకబడుతున్నది. ఈ విషయంలో జనసేన తన కార్యాచరణపై సమీక్ష నిర్వహించుకోవలసిన అవసరం ఉన్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు,  అంత కంటే ముందు కూడా తమ సమస్యలను జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తే పరిష్కారం దిశగా ప్రభుత్వం కదులుతుందన్న విశ్వాసం జనంలో ఉండేది. 

ఉద్దానం సమస్యపై కానీ, ఫాతిమా మెడికల్ కాలేజీ వ్యవహారంలో కానీ పవన్ కల్యాణ్ గళమెత్తడం వల్లనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించిందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అటువంటి జనసేన పార్టీ ప్రజాసమస్యలపై గళమెత్తే విషయంలో ఇటీవలి కాలంలో వెనుకబడింది.

జనసేన కార్యక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్యపై కానీ, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం విషయంలో కానీ ప్రజల తరఫున జనసేన నిలబడిన దాఖలాలు లేవు. ఏదో యథాలాపంగా ఒక ప్రకటన విడుదల చేసి మిన్నకుండటంతో ఆ పార్టీ పయనమెటన్న అనుమానం సామాన్య ప్రజలలో నెలకొని ఉంది.

ఇప్పుడు నల్లమల రక్షణ కోసం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడతామంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు జనసేనకు జవసత్వాలను తీసుకువస్తుందని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులూ ఆశాభావంతో ఉన్నారు.  

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం నుంచీ కూడా తనదైన ప్రత్యేక శైలిలో ముందుకు వెళుతున్నారు. తొలి రోజులలో విజయం కోసం కాదు అంటూ చేసిన ప్రసంగాలు...పార్టీ పురోగతికి ఒకింత చేటు చేశాయని చెప్పాలి. రాజకీయ పార్టీ నేతగా విజయంపై ధీమా వ్యక్తం చేయాలి. కేడర్ లో విజయం పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలి.

ఆ తరువాత తరువాత పార్టీ గెలుపు విషయంలో ధీమా వ్యక్తం చేసినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ప్రచార నిర్వహణలో కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ అవసరమైనంత శ్రద్ధ చూపలేదన్న భావన పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమైంది. అయితే పార్టీ పరాజయంతో కృంగిపోకుండా ప్రజల పక్షాన జనసేన నిలబడుతుందన్న విశ్వాసాన్ని పవన్ కల్యాణ్ సామాన్యులలో కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ భవిష్యత్ పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. యురేనియం విషయంలో జనసేన స్టాండ్ ఆ పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే.

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   6 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   11 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   14 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   14 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   15 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   16 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle