newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

పవన్ కు షాక్.. వైసీపీలోకి మాజీమంత్రి

06-09-201906-09-2019 08:09:41 IST
Updated On 06-09-2019 14:09:53 ISTUpdated On 06-09-20192019-09-06T02:39:41.359Z06-09-2019 2019-09-06T02:39:18.194Z - 2019-09-06T08:39:53.902Z - 06-09-2019

పవన్ కు షాక్.. వైసీపీలోకి మాజీమంత్రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఆపార్టీ నేతల తీరుమాత్రం పవన్‌కు  షాకిచ్చేలా వున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టీడీపీ నేతలు జనసేనలో చేరారు.

ఎన్నికల అనంతరం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి, జనసేన నేత పసుపులేటి బాలరాజు వైఎస్ఆర్‌సీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. 

తన సన్నిహితులు, కార్యకర్తలతో బాలరాజు సమావేశమయ్యారు. పార్టీ మారే విషయమై కాలమే నిర్ణయిస్తోందని బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి  సీఎం జగన్ కూడాసానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.

అనారోగ్యం వల్ల మూడు మాసాలుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా చింతపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన బాలరాజు జనసేన పార్టీ నేతలతో విపులంగా చర్చించారు.

పార్టీ మారే విషయమై బాలరాజు పరోక్షంగా తన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చారని అంటున్నారు. 

ఈసందర్భంగా జగన్ పాలనపై పొగడ్తలు కురిపించారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్ అమల్లోకి తీసుకొచ్చారని మద్యపాననిషేధం విధింపు కీలక నిర్ణయమని అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు అందినప్పుడే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని ఆయన చెప్పారు. అయితే చిన్నచిన్న తప్పిదాలు జరుగుతున్నాయన్నారు.

బాలరాజు కూడా పార్టీని వీడితే పార్టీలో కీలక నేతలు తప్పుకున్నట్టు అవుతుంది. అడపాదడపా లోక్ సత్తా పార్టీ నుంచి నేతలు వలస వస్తున్నా అది పార్టీకి అంత బలం చేకూర్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన మేథోమథనం జరుగనుంది. అప్పటికి ఎంతమంది మిగులుతారో చూడాలి.  రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన పసుపులేటి బాలరాజు గత ఏడాది నవంబరులో జనసేనలో చేరారు.

విశాఖ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుకి  గిరిజన ప్రాంతాల్లో బాలరాజుకు పట్టుంది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లో అమాత్య పదవి వరించింది. ఆయన మరణానంతరం కిరణ్ కేబినెట్‌లోనూ బాలరాజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు.  

1989లో తొలిసారి చింతపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2009లో గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిచి ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందే ఆయన జనసేనలో చేరారు.

పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బాలరాజు ఫ్యాన్ గాలి ముందు నిలబడలేకపోయారు. అప్పటినుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   10 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle