ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

పవన్ కళ్యాణ్ డిఫెన్స్‌లో పడిపోయారా ?

14-01-201914-01-2019 14:26:54 IST
Updated On 14-01-2019 14:26:49 ISTUpdated On 14-01-20192019-01-14T08:56:54.571Z14-01-2019 2019-01-14T08:51:02.061Z - 2019-01-14T08:56:49.461Z - 14-01-2019

పవన్ కళ్యాణ్ డిఫెన్స్‌లో పడిపోయారా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెరాస నేతలు గతంలో వైయస్ రాజశేఖర రెడ్డిని దూషించారని, ఇప్పడు వారే ఒకటవుతున్నారని పవన్ కళ్యాణ్  తెరాసను దుయ్యబట్టారు. కెసిఆర్‌తో తాను  కుమ్మక్కవుతున్నానంటూ గతంలో  తన మీద చంద్రబాబు చేసిన విమర్శలకు ఇది సమాధానమా ?  అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి. తనకూ..కెసిఆర్ కూ ఎటువంటి సంబంధంలేదని, జగన్ పట్ల  తనకు ఎటువంటి  మెతక వైఖరి లేదని చెప్పడానికే పవన్ కళ్యాణ్  డిఫెన్స్‌లో పడిపోయి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా ? దీనికి తోడు రెండు రోజులుగా పవన్-బాబుల మధ్య మళ్ళీ సఖ్యత నెలకొంటుందంటూ పుకార్లు  షికార్లు చేస్తున్నాయి. మొన్నీమధ్యే పవన్ తాను తెలుగుదేశం నేతలెవరిపైనా విమర్శలు చేయలేదంటూ చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ కొంతమంది తెలుగుదేశం అభిమానులు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొంతమంది తమ నాయకుడు లోకేష్ పైన పవన్ అన్న మాటల్ని సోషల్ మీడియా సైట్లలో పెడితే ఇంకొంతమంది మాత్రం  'ఇదంతా రేపటి రోజున బాబు-పవన్లిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా'అంటూ  రాసేస్తున్నారు.

రాజకీయంగా ఒకవైపు జగన్ మరోవైపు చంద్రబాబును ఎదుర్కోవాల్సిన పవన్ కళ్యాణ్ తాజాగా అందులో కెసిఆర్ పేరును కూడా చేర్చాల్సి రావడాన్ని గమనించవచ్చు. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న మోడీ ప్రభుత్వాన్ని అందరూ కలిసి అటకెక్కించేసినట్లు కనబడుతుంది. అప్పుడప్పుడూ తప్ప ఆ మాటల్ని ఈమధ్య ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మోడీని విమర్శించడం వలన తమకు ఒరిగేదేమీ లేదని ఆలోచనలో పడ్డారా ?  

ఇక పవన్ కళ్యాణ్ పదేపదే తాను రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదని,అధికారం ముఖ్యం కాదని చెప్తున్న మాటలు  ఆయన అభిమానుల్ని నిరాపరుస్తున్నాయి. అధికారమే పరమావధిగా నడుస్తున్న రాజకీయాల్లో పవన్ మాటలు పెద్దగా రుచించవన్నది వాస్తవమే. అయితే ఎన్నికల వేళ ఎటువంటి' రుచీపచీలేని'వ్యాఖ్యలు చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలుండవన్నది పవన్ అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి తోడు పవన్ డిఫె‌న్స్‌లో పడిపోతున్నారా అంటూ ఒక వైస్సారసీపీ  నేత అన్నారు. ఈ నేపథ్యంలో ఇక రేపటి పవన్ ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుందన్నది చూడాలి! 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle