newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

‘పవన్ కళ్యాణ్ చంద్రబాబు గొంతయ్యారా?’

02-09-201902-09-2019 09:26:00 IST
Updated On 05-09-2019 16:38:30 ISTUpdated On 05-09-20192019-09-02T03:56:00.606Z02-09-2019 2019-09-02T03:55:54.030Z - 2019-09-05T11:08:30.545Z - 05-09-2019

‘పవన్ కళ్యాణ్ చంద్రబాబు గొంతయ్యారా?’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్నమొన్నటివరకూ వరదలపై మాటా మాటా వినబడితే.. ఇప్పుడు పోలవరం, రీటెండరింగ్, అమరావతి అంశాలు తెరమీదకు వచ్చాయి. అమరావతి విషయంలో బాంబు పేల్చిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి మాటల తూటాలు పేల్చారు.

చంద్రబాబుతో పాటు పవన్ తీరుని ఆయన ఎండగట్టారు. ఒక రాజధానిలో వేయి కుంభకోణాలు జరిగాయని, ఈ కుంభకోణాలలో చంద్రబాబు,లోకేష్‌ ప్రధాన భాగస్వాములు అయ్యారన్నారు. అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంంటూ ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. 

అమరావతి అభివృధ్ది ముసుగులో భారీ దోపిడీ జరిగిందని, మంత్రులు,ఎంఎల్‌ ఏల క్వార్టర్ల నిర్మాణంలో సైతం అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదన్నారు.

మీ మైండ్‌ సెట్‌ మీ జనసేన పార్టీ అజెండా మారలేదని దుయ్యబట్టారు బొత్స. మీతీరు చూస్తుంటే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో భూదోపిడీ చేస్తే సహించమని నాడు పవన్‌ కల్యాణ్‌ గర్జించారని, కానీ ఇప్పుడు చంద్రబాబుకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. పవన్‌ ద్వందవైఖరి, ద్వంద్వ విధానం అర్దం కావడంలేదన్నారు.

పవన్‌ కల్యాణ్‌ కు,చంద్రబాబుకు ఇంటికి జాగా ఇచ్చిన వ్యక్తి ఒకరే అన్నారు బొత్స. గత ప్రభుత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ ప్రశ్నించలేదని, పోలవరం ప్రాజెక్ట్‌ లో అవినీతిని అరికట్టడం తప్పా? అన్నారు.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం తెలుగుదేశం కు ఏటిఎం అని సాక్షాత్తు ప్రధాని వ్యాఖ్యానించారని, ఎంత కచ్చితమయిన సమాచారం లేకపోతే మోడీ అలా ఎందుకు మాట్లాడతారన్నారు.

పీపీఎల సమీక్ష ద్వారానే విద్యుత్ ధరల దోపిడీని అరికడతామని, రైతులకు నాణ్యమయిన విద్యుత్ అందిస్తామన్నారు. అమరావతి విషయంలో బొత్స వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. అమరావతిపై జగన్ క్లారిటీ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle