newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

పవన్ కళ్యాణ్ కళ్లు తెరవండి .. మంత్రి కన్నబాబు కౌంటర్

28-06-202028-06-2020 09:47:56 IST
2020-06-28T04:17:56.880Z28-06-2020 2020-06-28T04:17:45.361Z - - 05-07-2020

పవన్ కళ్యాణ్ కళ్లు తెరవండి .. మంత్రి కన్నబాబు కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజకీయ విమర్శలు వేడిని రాజేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం-జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య అనేక అంశాల్లో మాటల దాడి జరుగుతోంది. కాపు నేస్తం, కాపుల రిజర్వేషన్ అంశాల్లో పవన్ కళ్యాణ్ వాస్తవాలను విస్మరిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా సామాజిక వర్గాలను విడదీసి చంద్రబాబు కులాల మధ్య చిచ్చురేపారని, జగన్ రెడ్డి కులస్థుడైనా అందరివాడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాపు నుంచి రెల్లి కులస్థుడిగా మారతాను అని పవనే ప్రకటించారు. కాపులకు ఆర్ధిక సాయం చేస్తే పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఉక్రోషం వస్తోందన్నారు. 

ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తానని 100 కోట్లే ఇస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేకపోయారు. నేత పనిలోనూ కాపులు ఉన్నారు. వారికీ సాయం అందింది నేతన్న నేస్తం ద్వారా. జగనన్న చేదోడు పధకం ద్వారా కూడా కాపులకు సాయం అందింది. కాపు నేస్తం పథకం ఎన్నికల మేనిఫెస్టో లో లేదు. అయినా ఆర్ధిక సాయం అందించామన్నారు. రిజర్వేషన్లు గురించి కాపులు ఉద్యమం చేసేటప్పుడు, వారిపై కేసులు పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేక పోయారు. కాపులపై కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, కేసులు ఎత్తివేసిన జగన్ ప్రభుత్వానికి తేడా కాపులే ఆలోచించాలి.

పవన్ కల్యాణ్ చూసే వైఖరి లొనే తేడా ఉందని అనిపిస్తోంది. జగన్ ను మాత్రమే ప్రశ్నించటం  పవన్ కల్యాణ్ ఫిలాసఫీ అనిపిస్తోంది. ఆయన ఇంకెవరినీ ప్రశ్నించరు. 2 లక్షల 30 వేల మంది కాపు, ఒంటరి, బలిజ మహిళలకు 350 కోట్ల రూపాయల మేర అందించామని, కాపు రిజర్వేషన్లు గురించి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉక్కుపాదం తో అణచివేసిందన్నారు. 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, రూ. 4,700 కోట్లు మేర నిధులు అన్ని పథకాల ద్వారా ఆయా వర్గాలకు అందించామన్నారు. ఇంత చేస్తే ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కుల ప్రస్తావన లేకుండా ఆయన మాట్లాడలేరా? గత ప్రభుత్వానికి స్నేహితుడిగా ఉన్న పవన్ ముద్రగడ ను అణచివేస్తుంటే ఒక్క మాట కూడా పవన్ ఎందుకు మాట్లాడలేదని, చంద్రబాబు పట్ల ప్రేమను దాచుకోలేని తత్వం పవన్ కళ్యాణ్ మార్చుకోవడం లేదన్నారు మంత్రి కన్నబాబు. 

అంతకుముందు కాపు కార్పోరేషన్ నిధులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. కాపు కులస్తుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళమెత్తారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తొక్కిపెట్టాలనే ఎత్తుగడలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాపు మహిళలకు జగన్ సర్కారు రూ. 15,000 చొప్పున జమ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. వెనుకబడ్డ జాతికి రిజర్వేషన్లు పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళనల నుంచి కాపుల దృష్టి మరల్చేందుకు గత టీడీపీ హయాంలో నాటి పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమస్య నుంచి కొంత వరకు ఏమార్చారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరింత తెలివితేటలతో ‘‘గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం’’ అన్న రీతిలో ఏ పథకం కింద లబ్ధి చేకూర్చినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్ధరించడానికేనని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచేశారని మండిపడ్డ సంగతి తెలిసిందే. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle