newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

పవన్ కళ్యాణ్ కంటే దుష్యంతే చాలా మేల‌ట‌..!

30-10-201930-10-2019 14:26:17 IST
Updated On 30-10-2019 15:32:28 ISTUpdated On 30-10-20192019-10-30T08:56:17.665Z30-10-2019 2019-10-30T08:56:15.468Z - 2019-10-30T10:02:28.157Z - 30-10-2019

పవన్ కళ్యాణ్ కంటే దుష్యంతే చాలా మేల‌ట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల్లో స‌రికొత్త పోలిక ఒక‌టి మొద‌లైంది. అది కూడా ఇద్ద‌రు యువ నాయ‌కుల గురించి కావ‌డం గ‌మ‌నార్హం. వారిద్ద‌రి పొలిటిక‌ల్ ఎంట్రీ సంచ‌ల‌న‌మే అయినా ఇద్ద‌రిలోనూ చాలా వ్య‌త్యాసం ఉంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు దుష్యంత్ చౌతాలా. ఇప్పుడు ఇండియ‌న్ పాలిటిక్స్‌లో మారుమోగుతున్న పేరు ఇది. హ‌ర్యానా ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌కంగా మారిన వ్య‌క్తి. దీంతో ఆయ‌న చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యారు. ఆయన వ‌య‌స్సు కేవ‌లం 31 ఏళ్లే అయినా జాతీయ పార్టీలైన‌ కాంగ్రెస్‌, బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడి ఇప్పుడు కింగ్ మేక‌ర్ అయ్యారు.

మ‌రోప‌క్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ ఎంట్రీ కూడా సంచ‌ల‌నమ‌నే ఎప్పాలి. కానీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ఏపీలో ఒక్క‌టంటే ఒక్క అసెంబ్లీ సీటుతో స‌రిపెట్టుకోవాల్సి వచ్చింది. దుష్యంత్ కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుడే. కానీ ప‌వ‌న్‌కు సినిమా స్టార్ ఇమేజ్ కూడా తోడుంది. అయినా ప‌వ‌న్ గెల‌వ‌లేక‌పోయారు. ఇప్పుడు జ‌నం కూడా ఇదే విష‌యాన్ని చ‌ర్చించుకుంటున్నారు.

వీరిద్ద‌రిలో దుష్యంత్ స‌క్సెస్‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫెయిల్యూర్‌కు తేడా ఏంట‌న్న విష‌య‌మై చ‌ర్చ మొద‌లైంది. దుష్యంత్ అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీని గ‌ట్టిగా టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. కానీ, ప‌వ‌న్ అలా చేయ‌లేదంటున్నారు. ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీని ప‌క్క‌న‌పెట్టేసి ప్ర‌తిపక్షంలో ఉన్న జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఎక్కువైపోయింద‌న్న అభిప్రాయాన్ని విశ్లేష‌కులు వ్య‌క్త ప‌రుస్తున్నారు.

ఇలా నాడు ప్ర‌తిప‌క్షాన్నే టార్గెట్ చేయ‌డంతో ప‌వ‌న్‌ను ప్ర‌త్యామ్నాయంగా జ‌నం చూడ‌లేక‌పోయార‌ని తెలుస్తుంది. టీడీపీ మ‌నిషిగానే జ‌న‌సేనానిని ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకున్నారు. అందుకే సినిమాలు చేసుకోమ‌ని గెలిపించ‌లేదంటున్నారు విశ్లేష‌కులు. జ‌నాల‌కు ఎప్పుడైనా న‌మ్మ‌కం కుదిరితేనే ఓట్లు వేస్తారు. లేక‌పోతే పంపించేస్తారు. దుష్యంత్ చౌతాలా అలా కాదు. ఇటు బీజేపీని, అటు కాంగ్రెస్‌ను చీల్చి చెండాడారు. దీంతో ప్ర‌జ‌లు ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకుని కింగ్ మేక‌ర్‌కు కావాల్సిన‌న్ని సీట్లు ఇచ్చారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికీ పూర్తి రాంగ్ ట్రాక్‌లో వెళుతున్నార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని, చంద్ర‌బాబు మీద ఈగ కూడా వాల‌కుండా ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయాలు తెలుగు ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మైపోయాయ‌ని ఇటు పొలిటిక‌ల్ ఎన‌లిస్టుల‌తోపాటు అధికార ప్ర‌తిప‌క్షం కూడా విమ‌ర్శిస్తోంది. జ‌గ‌న్ మీద కేసులు ఉంటే వాటిని కోర్టులు తేలుస్తాయి.. నాడు అస‌లు ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేసి ఉంటే ప‌వ‌న్ కూడా ఇప్పుడు దుష్యంత్ లానే కింగ్ మేక‌ర్ సీట్లు గెలిచి ఉండేవార‌న్న‌ది వారి అభిప్రాంయం.

వైసీపీపై టీడీపీ చేసే ప్ర‌తి విమ‌ర్శను స‌మ‌ర్ధించేలా ప‌వ‌న్ కూడా మాట్లాడ‌టంతో జ‌న‌సేన దెబ్బైపోయింద‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇప్ప‌టికైనా త‌న రూట్ ఏంటో కొంచెం దుష్యంత్‌ను చూసి క్లారిటీ తెచ్చుకుంటే జ‌నాలు ఆద‌రించ‌డానికి అవ‌కాశాలు ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వారి చ‌ర్చ‌ల్లో పేర్కొంటున్నారు.

 

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle