పవన్ కళ్యాణ్‌కి షాక్... కీలకనేతల రాజీనామా
06-10-201906-10-2019 10:58:01 IST
Updated On 06-10-2019 10:58:13 ISTUpdated On 06-10-20192019-10-06T05:28:01.932Z06-10-2019 2019-10-06T05:27:43.586Z - 2019-10-06T05:28:13.960Z - 06-10-2019

జనసేన పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. పవన్ కు మరో ఇద్దరు నేతలు షాకిచ్చారు. జనసేన పార్టీకి రాజీనామా చేశారు రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే డా.ఆకుల సత్యనారాయణ సతీమణి లక్ష్మీ పద్మావతి. ఆమె ఈనెల 8న వైసీపీ లో చేరనున్నారని తెలుస్తోంది. ఆమెకు రాజమహేంద్రవరం రూరల్ ఇంచార్జ్ గా బాధ్యతలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటు విశాఖ జిల్లా గాజువాక లో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ కి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య. తన రాజీనామా లేఖను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపారు.
చింతలపూడి వెంకట్రామయ్య. 2019 ఎన్నికలలో పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు చింతలపూడి. తన అభిమానులు, అనుచరులు గాజువాక నుండి రాజకీయాలు కొనసాగించాలని కోరుకుంటున్నారని...అందువల్ల రాజీనామాచేస్తున్నానని చింతలపూడి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

తనకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కుటుంబం అంటే ఎంతో గౌరవం అన్నారు చింతలపూడి. ఇంతవరకూ జనసేన పార్టీలో నాపై చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. చింతలపూడి రాజీనామాతో విశాఖ జిల్లా గాజువాకలో పార్టీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.


దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
32 minutes ago

రాజా సింగ్‌కు స్వంత పార్టీలోనే శత్రువులా..?
9 hours ago

బాబు బోర్లాపడితే జగన్ గోతిలో పడుతున్నారా?
10 hours ago

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
10 hours ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
10 hours ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
11 hours ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
11 hours ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
13 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
13 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
05-12-2019
ఇంకా