newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!

05-12-201905-12-2019 18:34:39 IST
Updated On 12-12-2019 16:09:25 ISTUpdated On 12-12-20192019-12-05T13:04:39.668Z05-12-2019 2019-12-05T13:04:35.539Z - 2019-12-12T10:39:25.573Z - 12-12-2019

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా.. ఈమాటలు ఏ సినిమాలో డైలాగ్ లు కావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలో ఒక అభిమాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి. ఈ తలనరుకుడు కామెంట్లే ఇప్పుడు తెలుగు రాజకీయాలను ఊపేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నీతిగా ఉందాం.. అందరికీ మర్యాద ఇద్దామనడంతో వెనక్కు తగ్గాం.. ఆయన సై...పవన్ ఆదేశిస్తే ప్రకాష్ రెడ్డి ... ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని జనసేన నేత సాకే మురళి అన్నారు. పవన్ రెడీ అంటే మేమూ రెడీనే అని అన్నారు.

కేసులకు జనసైనికులు భయపడరన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలుల రెడీ అంటే తామూ రెడీనే అంటూ సవాల్ విసిరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీచేశారు సాకె పవన్ కుమార్. 

చిత్తూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లా రాప్తాడు కి చెందిన పార్టీ నేత సాకే పవన్ కుమార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయని పవన్ ఆరోపించారు. ప్రతి ఒక్కరి నోటి నుంచి ప్రకాష్ రెడ్డి పేరే వినిపిస్తోందన్నారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని వాపోయారు. పవన్ ఆదేశిస్తే ఒక్క ప్రకాశ్ రెడ్డి తల కాదు.. ఏ రెడ్డి తలనైనా నరికి తీసుకొస్తా అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. తాను దేనికైనా రెడీ అని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. దీనిపై పవన్ ఏమంటారోనని తాను వేచి చూశానని కానీ పవన్ కూడా అదే ధోరణితో ఉండడం ఆశ్చర్యం కలిగించిందన్నారు ప్రకాష్ రెడ్డి. 

మరోవైపు పవన్ వ్యాఖ్యలపై జనసేనాని పవన్ స్పందించారు. సాకె పవన్ వ్యాఖ్యలను పవన్ సమర్థించారు. ఎంతో ఆవేదన చెందాడు కాబట్టే పవన్ ఆ మాట అన్నారని అన్నారు. వైసీపీ నేతలు ఎన్నోసార్లు రాప్తాడులో పవన్ ని  బెదిరించారని పవన్ వాపోయారు. మాజీ సీఎం చంద్రబాబుని ఉరి తీయాలని జగన్ అన్నారని గుర్తు చేసిన పవన్.. నాడు జగన్ పై ఏ కేసు పెట్టారో ఇప్పుడు తమ పార్టీ నేత పైనా అదే కేసు పెట్టాలని సవాల్ చేశారు.

కార్యకర్తను మందలించాల్సిన అధినేతే.. సమర్థించడం దారుణం అని వైసీపీ నేతలు అన్నారు. సాకె పవన్ వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదుచేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాము కేసులకు భయపడేది లేదని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle