newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

పవన్ అది కరెక్ట్ కాదు కదా.. తులసిరెడ్డి ఫైర్

05-12-201905-12-2019 09:46:56 IST
2019-12-05T04:16:56.484Z05-12-2019 2019-12-05T04:16:44.231Z - - 19-01-2020

పవన్ అది కరెక్ట్ కాదు కదా.. తులసిరెడ్డి ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఏపీ కాంగ్రెస ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పర్యటనలో అమిత్ షాపై పవన్ చేసిన కామెంట్లపై ఇప్పటికే రాజకీయ రగడ రాజుకుంది. అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు తులసిరెడ్డి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయకుండా, రాయలసీమ, పోలవరానికి, రాజధానికి నిధులు ఇవ్వకుండా ఏపికి తీరని అన్యాయం చేస్తున్నది కేంద్రంలోని అమిత్ షా కాదా అని తులసిరెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రానికి అమిత్ షా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా అని అన్నారు. బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐటి, ఈడి, సిబిఐలను కీలు బొమ్మలు గా చేసి రాజకీయ ప్రత్యర్ధుల మీద ప్రయోగించడం కరెక్ట్ కాదు కదా అన్నారు తులసిరెడ్డి.

పెద్ద కరెన్సీ నోట్ల రద్దులో దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టివేయడం కరెక్టేనా..వీటిపై పవన్ సమాధానం చెప్పాలని తులసీరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపికీ పవన్ దగ్గరవుతున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.

బీజేపీలోని ఎన్డీయే మిత్ర పక్షాలు అమిత్ షా లాంటి నాయకత్వం కావాలని కోరుకోవడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీలో త్వరలో జనసేన విలీనం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విలీనం అనేది ప్రస్తుతం ఆచరణ అవుతుందా అనేది చెప్పలేం. 

ఇటీవల పరిణామాల్లో ప్రశ్నించడం మానేసి పవన్ ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ పై విమర్శించడంలోనూ బీజేపీ వాయిస్ పవన్ నోటినుంచి రావడం గమనార్హం.

జగన్ హయాంలో మతమార్పిడుల గురించి పవన్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి రుచించే తరహాలోనే ఆయన విమర్శలు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి అసలు ప్రశ్నించడం మానేశారు పవన్. 2019లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తే పరిస్థితి ఎలా వుండేదని, జగన్ సీఎం కావడం వెనుక తానే కారణం అన్నారు. జగన్ తనకు దణ్ణం పెట్టాలని తిరుపతిలో వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. పవన్ తన ధోరణిపై ప్రజలకు సమాధానం చెప్పాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle